బాబు దగా.. ఇది ముంచిన బడ్జెట్‌: రాచమల్లు | Rachamallu Siva Prasad Reddy Comments On Budget Of Chandrababu Govt | Sakshi
Sakshi News home page

బాబు దగా.. ఇది ముంచిన బడ్జెట్‌: రాచమల్లు

Published Tue, Nov 12 2024 12:00 PM | Last Updated on Tue, Nov 12 2024 1:29 PM

Rachamallu Siva Prasad Reddy Comments On Budget Of Chandrababu Govt

సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్ర ప్రజలను చంద్రబాబు సర్కార్‌ దగా చేసిందంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలప్పుడు కూటమిగా ఏర్పడి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ‘‘అధికారంలోకి రాగానే వెంటనే వాటిని అమలు చేస్తామని ఓటు అడిగారు. మహిళకు 15 వేలు, ఉచిత బస్సు, నిరుద్యోగులకు 3వేల భృతి ఇస్తామన్నారు. 20 వేలు రైతుకు, 25 లక్షల ఉద్యోగాలు ఇలా అనేకం సూపర్ సిక్స్, మేనిఫెస్టో ఉన్నాయి. గెలిచిన వెంటనే అమలు చేస్తామని వాగ్దానం చేశారు.  6 నెలలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో కాలయాపన చేశారు. నిన్న పూర్తి బడ్జెట్ పెట్టారు.. దాంట్లో మీరిచ్చిన ఈ ఒక్క హామీ కనిపించలేదు’’ అంటూ రామమల్లు నిలదీశారు.

నువ్వు మోసగాడివని తెలిసినా నీకు ఓటేయడానికి కారణం ప్రజల్లో చిన్న ఆశ. పేదరికం చెడ్డది.. ఆ పరిస్థితుల్లో మనిషి ఆశ పడతాడు. ప్రజలు కూడా ఆశ పడ్డారు.. కానీ హామీలన్నీ తుంగలో తొక్కారు. పేదరికం వల్ల జగన్‌ను ఓడించడం ఇష్టం లేకున్నా నీకు ఓటేశారు. 58.5 లక్షల మంది రైతులు ఉన్నారు.. మీ లెక్క ప్రకారం 20 వేలా చొప్పున 14వేల కొట్లు బడ్జెట్ లో పెట్టారు. వీళ్లలో 30 లక్షల మందికి మాత్రమే నువ్వు బడ్జెట్ పెట్టావ్. తల్లికి వందనం రేపటి ఏడాది ఇంటర్ వాళ్లకి తీసేస్తారు. ఈ ఏడాదికి 14 వేల కోట్లు పింఛన కోత విధించావు. 30 ఏళ్లుగా ప్రజల్ని మోసం చేసావు.. ఇంకా ఎంత కాలం మోసం చేస్తావు’’ అని చంద్రబాబును రాచమల్లు దుయ్యబట్టారు.

ఇది ప్రజలను ముంచే బడ్జెట్: రాచమల్లు

ఆశతో నీకు పేదవాడు ఓటు వేస్తే నట్టేట ముంచావు. ఇది ముంచిన బడ్జెట్ మాత్రమే. ఈయన సంపద సృష్టించే వాడు కాదు.. సంపద లాక్కునే వాడు. విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచావ్. రేపటి నెల నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచబోతున్నారు. 4 కోట్ల మందిని మోసం చేయగల ఘనాపాటి చంద్రబాబు. రాబోయే రోజుల్లో నీ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తాం. సోషల్ మీడియా వారిని నువ్వు హింసిస్తున్నట్లు నీపై ప్రజాస్వామ్య యుతంగా దాడి చేస్తాం. రూ. 15 వేలు ప్రతి ఆడబిడ్డకు ఎప్పుడు ఇస్తున్నారో చెప్పండి. రైతుకు 20 వేలు, నిరుద్యోగ భృతి 3 వేలు ఎప్పుడిస్తావో చెప్పండి. కక్ష సాధింపు చర్యలు మాని. ప్రజలకు సాయపడే పనులు చేయండి’’ అని రాచమల్లు హితవు పలికారు.

‘‘ఇసుక ఉచితం అన్నారు.. ఉచితం మాత్రం అటకెక్కింది. ఈ రోజు ఎన్నికలు పెడితే.. మీకు కనీసం ఒక్క సీటు కూడా రాదు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చనప్పుడు ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసే విధానం రావాలి. అలాంటి మోసపు పార్టీలను పోటీ చేయకుండా చేయాలి.. ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీకి మైకు ఇవ్వనప్పుడు వెళ్లి ఏం చేయాలి?. ప్రజలు సమస్యల గురించి కాదు.. అవమానం చేయడానికి పిలుస్తున్నారు. ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు.. టీడీపీ సోషల్‌ మీడియా పెట్టిన అసభ్యకరమైన పోస్టులపై ఏం చర్యలు తీసుకున్నారు..?. వర్రాను అవినాష్ రెడ్డి పేరు చెప్పమని ఒత్తిడి చేసి కొట్టారు. ఆయన జడ్జి ముందు వాస్తవాలు చెప్పడంతో కంగు తిన్నారు’’ అని రాచమల్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement