ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 510 పాయింట్లు జంప్‌చేసి 40,268 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా మార్కెట్లనే మించుతూ భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం ఊపందుకుంది. జాబితాలో జామ్నా ఆటో ఇండస్ట్రీస్, మ్యాగ్మా ఫిన్‌కార్ప్, ప్రిజమ్ జాన్సన్, యాంబర్ ఎంటర్‌ప్రైజెస్, సువెన్ ఫార్మాస్యూటికల్స్, సుందరం ఫైనాన్స్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..
జామ్నా ఆటో ఇండస్ట్రీస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 47 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 93,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1.53 లక్షల షేర్లు చేతులు మారాయి.
మ్యాగ్మా ఫిన్‌కార్ప్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 40 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.3 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1.84 లక్షల షేర్లు చేతులు మారాయి.
ప్రిజమ్ జాన్సన్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం లాభపడి రూ. 76 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 55,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 76,000 షేర్లు చేతులు మారాయి.
యాంబర్ ఎంటర్‌ప్రైజెస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6.6 శాతం జంప్‌చేసి రూ. 2,239 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2,353 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 15,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 14,500 షేర్లు చేతులు మారాయి.
సువెన్ ఫార్మాస్యూటికల్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 7.5 శాతం దూసుకెళ్లి రూ. 323 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 332 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 27,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 15,500 షేర్లు మాత్రమే చేతులు మారాయి.
సుందరం ఫైనాన్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8.5 శాతం ర్యాలీతో రూ. 1590 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1610ను అధిగమించింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3,300 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో కేవలం 1,300 షేర్లు చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment