వరుస నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు అనూహ్యంగా బౌన్స్ అయ్యాయి. ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతంసెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు దూసుకెళ్లి 37,350కు చేరింది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు ట్రేడర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. అయితే కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం పుంజుకోగా.. మరికొన్నిటిలో నీరసించింది. జాబితాలో ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్, వినతీ ఆర్గానిక్స్, గర్వారే టెక్నికల్ ఫైబర్స్, మజ్దా లిమిటెడ్, హ్యాపీయెస్ట్ మైండ్స్ చోటు సాధించాయి. ట్రేడింగ్ వివరాలు చూద్దాం..
ఐఎఫ్‌బీ ఇండస్ట్రీస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 12.5 శాతం దూసుకెళ్లి రూ. 617 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 634 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 18,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 7,000 షేర్లు మాత్రమే చేతులు మారాయి.
గర్వారే టెక్నికల్ ఫైబర్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం జంప్‌చేసి రూ. 2,001 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2,030 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 4,200 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 1,500 షేర్లు మాత్రమే చేతులు మారాయి.
వినతీ ఆర్గానిక్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 9.3 శాతం ర్యాలీ చేసి రూ. 1270 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,285 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 20,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 18,000 షేర్లు చేతులు మారాయి.
మజ్దా లిమిటెడ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం లాభపడి రూ. 506 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 535 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1600 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4,000 షేర్లు చేతులు మారాయి.
హ్యాపీయెస్ట్ మైండ్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం ఎగసి రూ. 364 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 386 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం 25.41 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 12.11 లక్షల షేర్లు మాత్రమే చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment