ప్రపంచ మార్కెట్ల పతనం కారణంగా నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని మిడ్ క్యాప్ కౌంటర్లలో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు తెరతీశారు. దీంతో స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్, జీఈ పవర్ ఇండియా, టాటా కాఫీ, ఎంసీఎక్స్ కౌంటర్లు భారీ నష్టాలతో డీలా పడ్డాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. వివరాలు చూద్దాం..
స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 12 శాతం పడిపోయి రూ. 659 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 646 వరకూ జారింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 50,000 షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 81,000 షేర్లు చేతులు మారాయి.
పిరమల్ ఎంటర్‌ప్రైజెస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.2 శాతం పతనమై రూ. 1218 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 1,198 వరకూ జారింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 52,000 షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 85,000 షేర్లు చేతులు మారాయి.
జీఈ పవర్ ఇండియా
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8.4 శాతం కుప్పకూలి రూ. 228 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 226 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 9,600 షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 65,000 షేర్లు చేతులు మారాయి.
టాటా కాఫీ లిమిటెడ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 7 శాతం తిరోగమించి రూ. 102 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 56,600 షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 57,000 షేర్లు చేతులు మారాయి.
ఎంసీఎక్స్ ఇండియా
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5.4 శాతం పతనమై రూ. 1,672 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 18,000 షేర్లుకాగా.. ఈ కౌంటర్‌లో మిడ్‌సెషన్‌కల్లా 2.74 లక్షల షేర్లు చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment