వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. సమయం గడిచేకొద్దీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం సెన్సెక్స్ 502 పాయింట్లు జంప్‌చేసి 36,973ను తాకింది. నిఫ్టీ సైతం 152 పాయింట్లు పెరిగి 10,892 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. జాబితాలో హెచ్‌ఈజీ లిమిటెడ్, హిందుస్తాన్ కాపర్, చెన్నై పెట్రోలియం, సంధార్ టెక్నాలజీస్, టెక్స్‌మాకో రైల్, టీఆర్‌ఎఫ్ చోటు సాధించాయి. ఇతర వివరాలు చూద్దాం..
హెచ్‌ఈజీ లిమిటెడ్
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌ఈజీ లిమిటెడ్ షేరు 13 శాతం దూసుకెళ్లి రూ. 818 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 834 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం కేవలం 25,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 65,000 షేర్లు చేతులు మారాయి.
హిందుస్తాన్ కాపర్
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హిందుస్తాన్ కాపర్ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 40 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 41.5 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2.62 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 3.6 లక్షల షేర్లు చేతులు మారాయి.
చెన్నై పెట్రోలియం
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో చెన్నై పెట్రోలియం షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 83 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 85 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.32 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1.36 లక్షల షేర్లు చేతులు మారాయి.
సంధార్ టెక్నాలజీస్
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో సంధార్ టెక్నాలజీస్ షేరు 8.5 శాతం దూసుకెళ్లి రూ. 218 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 232 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 2,200 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 1,400 షేర్లు మాత్రమే చేతులు మారాయి.
టెక్స్‌మాకో రైల్
ఎన్‌ఎస్‌ఈలో టెక్స్‌మాకో రైల్‌షేరు ప్రస్తుతం 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 5 పెరిగి రూ. 29 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 82,000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 3.67 లక్షల షేర్లు చేతులు మారాయి.
టీఆర్‌ఎఫ్ లిమిటెడ్
ఎన్‌ఎస్‌ఈలో టీఆర్‌ఎఫ్ లిమిటెడ్ షేరు ప్రస్తుతం 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 7.5 పెరిగి రూ. 81.4 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల ట్రేడింగ్ పరిమాణం 6,300 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 13,500 షేర్లు చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment