
నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 140 పాయింట్లు చొప్పున కోల్పోయాయి. అయితే కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు నష్టాలకు ఎదురీదుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం భారీగా పెరిగింది. జాబితాలో యాంబర్ ఎంటర్‌ప్రైజెస్, లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా, రత్నమణి మెంటల్స్, డిక్సన్ టెక్నాలజీస్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం...
యాంబర్ ఎంటర్‌ప్రైజెస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 15 శాతం దూసుకెళ్లింది. రూ. 1707 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1743 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2700 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 12,000 షేర్లు చేతులు మారాయి.
లారస్ ల్యాబ్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం దూసుకెళ్లింది. రూ. 1005 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1075 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.33 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 3.71 లక్షల షేర్లు చేతులు మారాయి.
గ్రాన్యూల్స్ ఇండియా
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 295 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 304 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3.83 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 3.51 లక్షల షేర్లు చేతులు మారాయి.
రత్నమణి మెటల్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 9 శాతం దూసుకెళ్లింది. రూ. 1139 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1193 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 750 షేర్లు మాత్రమేకాగా.. మధ్యాహ్నానికల్లా 2,000 షేర్లు చేతులు మారాయి.
డిక్సన్ టెక్నాలజీస్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 7.5 శాతం జంప్ చేసి రూ. 8205 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 8358 వరకూ ఎగసింది. ఇది ఏడాది గరిష్టంకావడం విశేషం! బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 4,500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 6,000 షేర్లు చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment