ఎగుమతి రంగాలు బెటర్...
ప్రస్తుతం ప్రధాన ఇండెక్స్‌లు గరిష్ట స్థాయిలో ఉన్నా... స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు వాటి గరిష్ట స్థాయిలకు చాలా దూరంలో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ వినియోగం ఉన్న రంగాలతో పాటు, ఎగుమతి ఆధారిత రంగాల షేర్లను కొనుగోలు చేయొచ్చు. ఎస్కార్ట్స్, ర్యాలీస్, కావేరీ సీడ్స్, ఐటీసీ, ఇమామి వంటి షేర్లతో పాటు రిస్క్ చేస్తే క్యాపెక్స్‌కు సంబంధించిన ఎల్ అండ్ టీ, ఏబీబీ, ఆటో యాన్సలరీస్ షేర్లు కూడా కోనుగోలు చేయొచ్చు. ల్యాంకో, ఎన్‌సీసీ, ఐవీఆర్‌సీఎల్ వంటి ఇన్‌ఫ్రా కంపెనీల షేర్లు తక్కువ ధరలో కనిపిస్తున్నా, వాటికున్న అప్పులు గుదిబండగా మారాయి. ఈ అప్పులను ఎలా తట్టుకొని నిలబడతాయన్న దాని తర్వాతే వీటికి పెరిగే శక్తి ఉందా లేదా అన్నది తెలుస్తుంది.
- ఆర్.వెంకట్రామన్, ఎండీ- ఇండియా ఇన్ఫోలైన్