export sectors
-
వృద్ధికి ‘తయారీ’ సహకారం అంతంతే
న్యూఢిల్లీ: తయారీ రంగానికి ప్రస్తుతం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం ద్వారా అందుతున్న చేయూత వల్ల సమీప మూడేళ్లలో దేశ ఆరి్థక వ్యవస్థకుకానీ లేదా ఎగుమతుల రంగానికిగానీ పెద్దగా జరిగే ప్రయోజనం ఏదీ ఉండకపోవచ్చని ఫారిన్ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా తన తాజా నివేదికలో పేర్కొంది. ఆసియా సరఫరా చైన్ ఇటీవల పాక్షికంగా చైనా నుంచి మారడం, దేశ ఎలక్ట్రానిక్ రంగంలో ఇటీవల అందుతున్న భారీ ప్రోత్సాహకాల వంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ దేశాభివృద్ధికి తయారీ తక్షణం అందించే సహాయ సహకారాలు తక్కువగా ఉంటాయని యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ తన్వీ గుప్తా పేర్కొన్నారు. అయితే చైనా నుంచి సరఫరాల చైన్ నిరంతరం కొనసాగడం, దేశంలో వ్యవస్థాగత సంస్కరణలు వల్ల దీర్ఘకాలంలో భారత్ ఎకానమీకి ప్రయోజనం ఉంటుందని పేర్కొన్న ఆమె, దీనివల్ల 2023 నాటికి వార్షికంగా 6.25 శాతం నుంచి 6.75 శాతం మేర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుదల రేటు ఉంటుందని అన్నారు. వార్షికంగా 40 లక్షల ఉద్యోగల కల్పనా సాధ్యమవుతుందని విశ్లేíÙంచారు. పూర్తి ఆశావహ పరిస్థితుల్లో వృద్ధి 6.75 శాతం నుంచి 7.25 శాతం శ్రేణిలో నమోదుకావచ్చని కూడా పేర్కొన్నారు. తయారీ రంగ ధోరణులు మారాలి... దేశంలో తయారీ రంగం పరిస్థితి గురించి ఆమె ప్రస్తావిస్తూ, తగిన ఉత్పాదక పురోగతి వ్యవస్థ లేనప్పుడు దానివల్ల ఎకానమీలకు పెద్దగా ప్రయోజనం ఒనగూడదన్నారు. తగిన ఉత్పాదక పరిస్థితి సానుకూలంగా ఉండడం అంటే విడిభాగాలను అధికంగా దిగుమతి చేసుకోవడం, వాటిని స్థానికంగా అసెంబ్లింగ్ చేసుకోవడానికి బదులు వాటినిసైతం స్థానికంగా తయారీ చేసుకోవడం, అందుకు ఒనరులను మెరుగుపరచుకోవడంగా ఆమె అభివరి్ణంచారు. ‘‘భారత్ భారీగా దిగుమతులు చేసుకుంటోంది. ఎక్కువ ఎగుమతి చేస్తోంది. ఇలాంటి విధానాల వల్ల వాస్తవిక ప్రయోజనం అంతంతే. ఇక్కడ మొబైల్ రంగాన్ని మంచి ఉదాహరణగా తీసుకుందాం. ఇక్కడ భారత్ చైనా తర్వాత రెండవ అతిపెద్దదిగా మారింది. అయినప్పటికీ, ప్రపంచ మొబైల్ ఉత్పత్తిలో భారత్ వాటా ఇప్పుడు 7 శాతం లోపే ఉంది. స్థానికంగా తయారీ, వనరుల సమీకరణ సామర్థ్యం పెంచుకోవడం ద్వారా ఈ రంగంలో మనం 25 శాతానికి చేరుకునే అవకాశం ఉంది.’’ అని గుప్తా గురువారం ఒక కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా విలేకరులతో అన్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... ► డాలర్‌తో రూపాయి మారకపు విలువ డిసెంబర్ వరకూ సగటున 82–83గా ఉంటుంది. తరువాత క్రమంగా మార్చి నాటికి 79కి బలపడే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు రూపాయి బలపడటానికి ఆర్బీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ► దేశీయ ఈక్విటీలు ఇప్పుడు అధిక విలువలో ఉన్నాయి. అందువల్ల ఈ సంవత్సరం ‘‘అండర్ వెయిట్’’ కలిగి ఉన్నాయి. దీనవల్ల ఈక్విటీలు భారీగా పెరిగే అవకాశం ఏదీ లేదు. ► ఆగస్టులో సైతం రిటైల్ ద్రవ్యోల్బణం 7 శాతం పైనే కొనసాగవచ్చు. ► మూలధన పెట్టుబడులు ఏదన్నా జరిగితే... అది ప్రభుత్వం ద్వారానే జరుగుతోంది. కార్పొరేట్ల నుంచి పెద్దగా లేదు. రానున్న 12 నెలల్లోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చు. వ్యవస్థలో తగిన మూలధన పెట్టుబడులు ప్రస్తుతం కొనసాగుతుండడం దీనికి కారణం. దీనికితోడు వడ్డీరేట్ల పెరుగుదల్ల వల్ల గృహ వినియోగ ధోరణి కూడా తగ్గుతోంది. -
14వ నెల 14% డౌన్!
♦ జనవరిలోనూ ఎగుమతులు నిరాశే ♦ అంతర్జాతీయ మందగమనం ఎఫెక్ట్ ♦ వాణిజ్యలోటు 8 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: ఎగుమతుల రంగం నిరాశలోనే కొనసాగుతోంది. 2015 జనవరితో పోల్చిచూస్తే... 2016 జనవరిలో ఎగుమతుల విలువలో అసలు వృద్ధి లేకపోగా 14 శాతం క్షీణత నమోదయ్యింది. విలువలో ఇది 21 బిలియన్ డాలర్లు. ఎగుమతుల క్షీణ ధోరణి ఇది వరుసగా 14వ నెల. దిగుమతుల విషయానికి వస్తే... దిగుమతులు కూడా క్షీణతలోనే పయనిస్తున్నాయి. జనవరిలో 11 శాతం క్షీణించి 29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతి- దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 8 బిలియన్ డాలర్లుగా ఉంది. 11 నెలల్లో ఇంత దిగువ స్థాయి వాణిజ్యలోటు ఇదే తొలిసారి. కాగా నెలలో చమురు దిగుమతులు 39 శాతం తగ్గి 5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురు యేతర దిగుమతులు 1.5 శాతం పడిపోయి 24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్షీణతకు కారణం... అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో అమెరికా, యూరప్ దేశాల్లో డిమాండ్ తగ్గడం, పెట్రో ఉత్పత్తుల ధరలు దిగువ స్థాయిలో ఉండడం వల్ల, భారత్ ఎగుమతుల విషయంలో సంబంధిత ప్రొడక్టుల నుంచి భారీ విలువలు లేని పరిస్థితులు, ఇంజనీరింగ్ ఉత్పత్తుల డిమాండ్ సన్నగిల్లడం వంటి అంశాలు భారత్ ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల చైనా మారకపు రేటు తగ్గింపూ ఎగుమతుల పోటీతత్వాన్ని తగ్గిస్తోంది. జనవరిలో పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతులు 35 శాతం క్షీణించి 1.95 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 28 శాతం పడిపోయి కేవలం 5 మిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి దిగుమతులు భారీ జంప్... జనవరిలో పసిడి దిగుమతులు మాత్రం భారీగా 85 శాతం ఎగశాయి. విలువలో ఇది 3 బిలియన్ డాలర్లు. ఈ కమోడిటీ దిగుమతి ఇంతగా పెరక్కుంటే... వాణిజ్యలోటు మరింత తగ్గి ఉండేది. 10 నెలల్లో... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి వరకూ ముగిసిన 10 నెలల కాలంలో ఎగుమతులు 18% పడిపోయి 218 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 16% పడిపోయి 325 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు 107 బిలియన్ డాలర్లు. భారత్ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) 265 బిలియన్ డాలర్ల నుంచి 270 బిలియన్ డాలర్ల శ్రేణిలోనే ఉండే అవకాశం ఉందని ఎఫ్ఐఈఓ (భారత ఎగుమతి సంఘాల సమాఖ్య) డెరైక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అంచనావేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల విలువ 311 బిలియన్ డాలర్లు. సహాయ్ అంచనాలే నిజమైతే దేశ ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాదాపు 40 బిలియన్ డాలర్ల మేర పడిపోయినట్లే. -
13వ నెలా ఎగుమతులు మైనస్..
డిసెంబర్లో 15% క్షీణత న్యూఢిల్లీ: భారత్ ఎగుమతుల రంగంలో నిరాశాజనక పరిస్థితులు కొనసాగుతున్నాయి. 2014 డిసెంబర్‌తో పోల్చితే 2015 డిసెంబర్లో ఎగుమతుల్లో అసలు వృద్ధి లేకపోగా 15 శాతం క్షీణత (మైనస్) నమోదయ్యింది. ఇలాంటి క్షీణ ధోరణి భారత ఎగుమతుల రంగంలో గడచిన 13 నెలలుగా కొనసాగుతోంది. తాజా సమీక్షా నెలలో ఎగుమతులు విలువ 22 బిలియన్ డాలర్లు. దిగుమతులూ క్షీణతే... కాగా దిగుమతుల్లోనూ క్షీణత కొనసాగుతోంది. వార్షిక ప్రాతిపదికన దిగుమతులు 3.88 శాతం క్షీణించి 34 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వాణిజ్యలోటు ఇదీ... ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి వాణిజ్యలోటు డిసెంబర్లో నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేర్చింది. విలువ రూపంలో ఇది 12 బిలియన్ డాలర్లు. పసిడి భారీ దిగుమతులు 179 శాతం అప్ పసిడి దిగుమతులు భారీగా పెరగడం డిసెంబర్ వాణిజ్య లోటు అధిక స్థాయికి కారణమైంది. 2014 డిసెంబర్‌తో పోల్చితే 2015 డిసెంబర్లో ఈ విలువైన మెటల్ దిగుమతులు 1.36 బిలియన్ డాలర్ల నుంచి 179 శాతం పెరిగి 3.80 బిలియన్ డాలర్లకు ఎగశాయి. -
ఎగుమతి రంగాలు బెటర్...
ప్రస్తుతం ప్రధాన ఇండెక్స్‌లు గరిష్ట స్థాయిలో ఉన్నా... స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు వాటి గరిష్ట స్థాయిలకు చాలా దూరంలో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ వినియోగం ఉన్న రంగాలతో పాటు, ఎగుమతి ఆధారిత రంగాల షేర్లను కొనుగోలు చేయొచ్చు. ఎస్కార్ట్స్, ర్యాలీస్, కావేరీ సీడ్స్, ఐటీసీ, ఇమామి వంటి షేర్లతో పాటు రిస్క్ చేస్తే క్యాపెక్స్కు సంబంధించిన ఎల్ అండ్ టీ, ఏబీబీ, ఆటో యాన్సలరీస్ షేర్లు కూడా కోనుగోలు చేయొచ్చు. ల్యాంకో, ఎన్సీసీ, ఐవీఆర్సీఎల్ వంటి ఇన్ఫ్రా కంపెనీల షేర్లు తక్కువ ధరలో కనిపిస్తున్నా, వాటికున్న అప్పులు గుదిబండగా మారాయి. ఈ అప్పులను ఎలా తట్టుకొని నిలబడతాయన్న దాని తర్వాతే వీటికి పెరిగే శక్తి ఉందా లేదా అన్నది తెలుస్తుంది. - ఆర్.వెంకట్రామన్, ఎండీ- ఇండియా ఇన్ఫోలైన్