14వ నెల 14% డౌన్! | 14th month 14percent down | Sakshi
Sakshi News home page

14వ నెల 14% డౌన్!

Published Tue, Feb 16 2016 1:34 AM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM

14వ నెల 14% డౌన్!

14వ నెల 14% డౌన్!

జనవరిలోనూ ఎగుమతులు నిరాశే
అంతర్జాతీయ మందగమనం ఎఫెక్ట్
వాణిజ్యలోటు 8 బిలియన్ డాలర్లు

 న్యూఢిల్లీ: ఎగుమతుల రంగం నిరాశలోనే కొనసాగుతోంది. 2015 జనవరితో పోల్చిచూస్తే... 2016 జనవరిలో ఎగుమతుల విలువలో అసలు వృద్ధి లేకపోగా 14 శాతం క్షీణత నమోదయ్యింది.  విలువలో ఇది 21 బిలియన్ డాలర్లు. ఎగుమతుల క్షీణ ధోరణి ఇది వరుసగా 14వ నెల.

 దిగుమతుల విషయానికి వస్తే...
 దిగుమతులు కూడా క్షీణతలోనే పయనిస్తున్నాయి. జనవరిలో 11 శాతం క్షీణించి 29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.  దీనితో ఎగుమతి- దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 8 బిలియన్ డాలర్లుగా ఉంది. 11 నెలల్లో ఇంత దిగువ స్థాయి వాణిజ్యలోటు ఇదే తొలిసారి. కాగా నెలలో చమురు దిగుమతులు 39 శాతం తగ్గి 5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురు యేతర దిగుమతులు 1.5 శాతం పడిపోయి 24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

 క్షీణతకు కారణం...
 అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో అమెరికా, యూరప్ దేశాల్లో డిమాండ్ తగ్గడం, పెట్రో ఉత్పత్తుల ధరలు దిగువ స్థాయిలో ఉండడం వల్ల, భారత్ ఎగుమతుల విషయంలో  సంబంధిత ప్రొడక్టుల నుంచి భారీ విలువలు లేని పరిస్థితులు, ఇంజనీరింగ్ ఉత్పత్తుల డిమాండ్ సన్నగిల్లడం వంటి అంశాలు భారత్ ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల చైనా మారకపు రేటు తగ్గింపూ ఎగుమతుల పోటీతత్వాన్ని తగ్గిస్తోంది. జనవరిలో  పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతులు 35 శాతం క్షీణించి 1.95 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 28 శాతం పడిపోయి కేవలం 5 మిలియన్ డాలర్లకు చేరాయి.

 పసిడి దిగుమతులు భారీ జంప్...
 జనవరిలో పసిడి దిగుమతులు మాత్రం భారీగా 85 శాతం ఎగశాయి. విలువలో ఇది 3 బిలియన్ డాలర్లు. ఈ కమోడిటీ దిగుమతి ఇంతగా పెరక్కుంటే... వాణిజ్యలోటు మరింత తగ్గి ఉండేది.

 10 నెలల్లో...
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి వరకూ ముగిసిన 10 నెలల కాలంలో ఎగుమతులు 18% పడిపోయి 218 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 16% పడిపోయి 325 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు 107 బిలియన్ డాలర్లు. భారత్ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) 265 బిలియన్ డాలర్ల నుంచి 270 బిలియన్ డాలర్ల శ్రేణిలోనే ఉండే అవకాశం ఉందని ఎఫ్‌ఐఈఓ (భారత ఎగుమతి సంఘాల సమాఖ్య) డెరైక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అంచనావేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల విలువ 311 బిలియన్ డాలర్లు. సహాయ్ అంచనాలే నిజమైతే దేశ ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాదాపు 40 బిలియన్ డాలర్ల మేర పడిపోయినట్లే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement