
మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీ స్టాక్ మార్కెట్లు పతన బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 608 పాయింట్లు పడిపోయి 33,639కు చేరగా.. నిఫ్టీ 184 పాయింట్లు కోల్పోయి 9,932 వద్ద ట్రేడవుతోంది. వెరసి సెన్సెక్స్ 34,000 పాయింట్లు, నిఫ్టీ 10,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరాయి. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పెరిగింది. వివరాలు చూద్దాం..
అదానీ ఎంటర్‌ప్రైజెస్
ప్రయివేట్ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం లాభపడి రూ. 155 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 6 శాతం ఎగసి రూ. 165ను అధిగమించింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.96 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 5.6 లక్షల షేర్లు చేతులు మారాయి.
జిందాల్ స్టెయిన్‌లెస్(హిసార్)
మెటల్ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 3 శాతం బలపడి రూ. 50 వద్ద ట్రేడవుతోంది. తొలుత 15 శాతం పెరిగి రూ. 56కు చేరింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 21,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 38,000 షేర్లు చేతులు మారాయి.
ఐనాక్స్ లీజర్
మల్టీప్లెక్స్ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం జంప్‌చేసింది. రూ. 247 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 254 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 78000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 58,000 షేర్లు చేతులు మారాయి.
పనాసియా బయోటెక్
హెల్త్‌కేర్ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 19 శాతం దూసుకెళ్లి రూ. 243 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 244ను అధిగమించడం ద్వారా 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 10,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 2.05 లక్షల షేర్లు చేతులు మారాయి.
ఇంటెన్స్ టెక్నాలజీస్
ప్రయివేట్ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 23 సమీపంలో ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 5500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా 21000 షేర్లు చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment