
మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 500 పాయింట్లు ఎగసి 36,500కు చేరింది. ఇది నాలుగు నెలల గరిష్టంకాగా.. నిఫ్టీ సైతం 155 పాయింట్లు జంప్‌చేసి 10,762ను తాకింది.అయితే ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు భారీ నష్టాలతో డీలాపడ్డాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో కళతప్పాయి. కొన్ని కౌంటర్లలో అమ్మకాల పరిమాణం సైతం భారీగా పుంజుకోగా.. మరికొన్ని కౌంటర్లలో నీరసించింది. జాబితాలో హిమత్‌సింగ్‌కా సీడే, ఒమాక్సే లిమిటెడ్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్, ఫ్యూచర్ రిటైల్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ధన్సేరీ వెంచర్స్ చోటు చేసుకున్నాయి. వివరాలు చూద్దాం..
హిమత్‌సింగ్‌కా సీడే
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6.4 శాతం పతనమై రూ. 60 దిగువన కదులుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 52000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 70,000 షేర్లు చేతులు మారాయి.
ఒమాక్సే లిమిటెడ్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం పతనమై రూ. 98 దిగువన కదులుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.41 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో కేవలం 1350 షేర్లు చేతులు మారాయి.
ఫ్యూచర్ లైఫ్‌స్టైల్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం పతనమై రూ. 148 దిగువన కదులుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 1.5 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 83,000 షేర్లు చేతులు మారాయి.
ఫ్యూచర్ రిటైల్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం పతనమై రూ. 130 దిగువన కదులుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 8.77 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 3.86 లక్షల షేర్లు చేతులు మారాయి.
రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 5 శాతం పతనమై రూ. 38.5 వద్ద కదులుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 7.92 లక్షల షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 57,000 షేర్లు చేతులు మారాయి.
ధన్సేరీ వెంచర్స్
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 8 శాతం పతనమై రూ. 55 దిగువన కదులుతోంది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3000 షేర్లుకాగా.. మిడ్‌సెషన్‌కల్లా ఈ కౌంటర్లో 10,000 షేర్లు చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment