
కరోనా వైరస్ రెండో దశకింద మళ్లీ విజృంభించవచ్చన్న ఆందోళనలు ప్రపంచ స్టాక్ మార్కెట్లను దెబ్బతీస్తున్నాయి. ఆసియా మార్కెట్లు నష్టపోగా.. యూఎస్ ఫ్యూచర్సా్ డీలా పడ్డాయి. దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతుండటంతో మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 723 పాయింట్లు పడిపోయింది 33,058కు చేరింది. ఇక నిఫ్టీ 207 పాయింట్లు కోల్పోయి 9,766 వద్ద ట్రేడవువతోంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని ఎంపిక చేసిన మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. కొన్ని కౌంటర్లలో ట్రేడింగ్ పరిమాణం సైతం పుంజుకోవడం గమనార్హం! జాబితాలో మాస్టెక్ లిమిటెడ్, ఇన్‌సెక్టిసైడ్స్ ఇండియా, కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్, క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్, టీవీ 18 బ్రాడ్‌క్యాస్ట్, ప్రీమియర్ పాలీ ఫిల్మ్ చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..
మాస్టెక్ లిమిటెడ్
ఐటీ సేవల ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువై రూ. 346 సమీపంలో ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2500 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 24,000 షేర్లు చేతులు మారాయి.
ఇన్‌సెక్టిసైడ్స్ ఇండియా
సస్యపరిరక్షణ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 19 శాతం దూసుకెళ్లి రూ. 494 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 499 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 17,000 షేర్లు చేతులు మారాయి.
కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్
మౌలిక సదుపాయాల రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 9 శాతం జంప్‌చేసింది. రూ. 215 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 219 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 12000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 28,000 షేర్లు చేతులు మారాయి.
క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్
హెల్త్‌కేర్ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం జంప్‌చేసింది. రూ. 408 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 422 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 10,000 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 62,000 షేర్లు చేతులు మారాయి.
టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్
ఈ ఎంటర్‌టైన్‌మెంట్ రంగ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం లాభపడి రూ. 32 వద్ద ట్రేడవుతోంది.తొలుత ఒక దశలో రూ. 32.5 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 3.9 లక్షల షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 6.6 లక్షల షేర్లు చేతులు మారాయి.
ప్రీమియర్ పాలీ ఫిల్మ్
ప్యాకేజింగ్ రంగ ఈ కంపెనీ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 11 శాతం పెరిగి రూ. 23 వద్ద ట్రేడవుతోంది.తొలుత ఒక దశలో రూ. 25 వరకూ ఎగసింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2800 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 15000 షేర్లు చేతులు మారాయి.
Comments
Please login to add a commentAdd a comment