9వ రోజూ జోరు- సెన్సెక్స్‌@ 48,000 | Sensex crosses 48,000 milestone on vaccines hopes | Sakshi
Sakshi News home page

9వ రోజూ జోరు- సెన్సెక్స్‌@ 48,000

Published Mon, Jan 4 2021 10:01 AM | Last Updated on Mon, Jan 4 2021 1:32 PM

Sensex crosses 48,000 milestone on vaccines hopes - Sakshi

ముంబై, సాక్షి: వరుసగా 9వ రోజూ దేశీ స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ మార్కెట్‌ చరిత్రలో తొలిసారి 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ప్రస్తుతం 250 పాయింట్లు ఎగసి 48,119కు చేరింది. నిఫ్టీ సైతం 83 పాయింట్లు పుంజుకుని 14,102 వద్ద ట్రేడవుతోంది. కోవిడ్‌-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 48,168 వద్ద, నిఫ్టీ 14,114 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. చదవండి: (2021లో పెట్టుబడికి 6 స్టాక్స్‌)

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా మెటల్‌, బ్యాంకింగ్‌‌, మీడియా 2-1 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, గెయిల్, గ్రాసిమ్‌, బీసీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐషర్‌, టీసీఎస్‌, ఐసీఐసీఐ, ఐవోసీ, ఎస్‌బీఐ, యాక్సిస్‌ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. బ్లూచిప్స్‌లో కేవలం హీరోమోటో, టైటన్‌, ఆర్‌ఐఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ మాత్రమే అదికూడా 0.5 శాతం స్థాయిలో డీలా పడ్డాయి.

ఐడియా జూమ్‌ 
డెరివేటివ్‌ స్టాక్స్‌లో ఐడియా, అశోక్‌ లేలాండ్, సెయిల్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఎన్‌ఎండీసీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌, ముత్తూట్‌, భెల్‌, నాల్కో 5.5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు కాల్గేట్‌ పామోలివ్‌ 0.4 శాతం క్షీణించింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,862 లాభపడగా.. 521 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. 

పెట్టుబడులవైపు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 506 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 69 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1,136 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 258 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement