జాతీయ,అంతర్జాతీయ అంశాలు దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.అమెరికాతో పాటు ఆసియా మార్కెట్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, భారత్‌లో యూనియన్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో మదపర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపుతున్నారు. వెరసి మంగళవారం ఉదయం 9.37 గంటల సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు నష్టంతో 59341 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ అత్యల్పంగా 47 పాయింట్ల నష్ట పోయి 17601 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది.
ఇక బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, జేఎస్‌డ్ల్యూ స్టీల్, యూపీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్,అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎం అండ్ ఎం, మారుతి సుజికి, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, సిప్లా, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్, టీసీఎస్, లార్సెన్,హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment