
సానుకూల ప్రపంచ సంకేతాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు మరింత జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 515 పాయింట్లు జంప్‌చేసి 37,455కు చేరింది. నిఫ్టీ142 పాయింట్లు ఎగసి 11,033 వద్ద ట్రేడవుతోంది. తద్వారా తిరిగి 11,000 పాయింట్ల కీలక మార్క్‌ను అధిగమించింది. వెరసి రెండు రోజుల వరుస అమ్మకాల తదుపరి దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ సాధించాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో రంగ కౌంటర్లకు డిమాండ్ పెరగడంతో మార్కెట్లు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.
మెటల్, ఎఫ్‌ఎంసీజీ
ఎన్‌ఎస్‌ఈలో మీడియా, ప్రయివేట్ బ్యాంక్స్, ఆటో, రియల్టీ, మెటల్, ఎఫ్‌ఎంసీజీ 2.4-0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఐటీ 0.7 శాతం, పీఎస్‌యూ బ్యాంక్స్ 0.4 శాతం చొప్పున నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆర్‌ఐఎల్, హీరో మోటో, మారుతీ, బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ 5.4-1.6 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఇండస్‌ఇండ్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, విప్రో, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్, బీపీసీఎల్, హెచ్‌యూఎల్ 2.7-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.
ఎక్సైడ్ జోరు
డెరివేటివ్ కౌంటర్లలో అపోలో టైర్, టాటా పవర్, బీఈఎల్, జూబిలెంట్ ఫుడ్, వోల్టాస్, ఇండిగో, టాటా కన్జూమర్ 3.6-2 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు శ్రీరామ్ ట్రాన్స్, పీఎన్‌బీ, ఐజీఎల్, మైండ్‌ట్రీ, పీవీఆర్, అరబిందో, 2.7-1.3 శాతం మధ్య నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.4-1 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1411 లాభపడగా.. 708 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.