
ముంబై : అంతర్జాతీయ మార్కెట్‌లో సూచీలు సానుకూలంగా ఉండటం, ఇటు ఏషియా మార్కెట్లు సైతం లాభాల బాటలో పయణిస్తుండటం దేశీ మార్కెట్ల జోరుకు మరింత ఊతం ఇచ్చాయి. గత కొంత కాలంగా కొనసాగుతోన్న బుల్ జోరుని మరింతగా పెంచాయి. దీంతో ఈ రోజు మార్కెట్ ప్రారంభమైన కొద్ది సేపటికే బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు ఆల్‌టైం హైలను టచ్ చేశాయి.
ఈ రోజు ఉదయం 9:50 గంటల సమయానికి బీఎస్‌సీ సెన్సెక్స్ 358 పాయింట్లు లాభపడి 62,123 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా ఎన్‌ఎస్‌సీ నిఫ్టీ 95 పాయింట్లు లాభపడి 18,571 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఈ రోజు నిఫ్టీ ప్రారంభం కావడమే 18,602 పాయింట్లతో మొదలై ఆల్‌టైం హైని టచ్ చేసింది. ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాలు పొందగా ఐటీసీ, ఆల్ట్రాటెక్, టైటాన్, పవర్‌గ్రిడ్ షేర్లు నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment