
వరుసగా మూడో రోజూ దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 233 పాయింట్లు జంప్‌చేసి 38,215ను తాకగా.. నిఫ్టీ 68 పాయింట్లు ఎగసి 11,295 వద్ద ట్రేడవుతోంది. ఆరు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ శుక్రవారం దేశీ స్టాక్ మార్కెట్లు హైజంప్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇన్వెస్టర్లు మరోసారి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో సెన్సెక్స్ 38,234 వరకూ ఎగసింది. ఈ బాటలో నిఫ్టీ 11,304 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది.
ఆటో జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, ఐటీ, మెటల్, ఫార్మా, రియల్టీ 1.3-0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హీరో మోటో, టీసీఎస్, ఎస్‌బీఐ లైఫ్, హిందాల్కో, అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, ఐషర్, టాటా స్టీల్, మారుతీ 3.4-1.4 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇండస్‌ఇండ్, పవర్‌గ్రిడ్, ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ, ఐటీసీ, గెయిల్, బజాజ్ ఫైనాన్స్ 1.5-0.5 శాతం మధ్య డీలాపడ్డాయి.
డెరివేటివ్‌లో..
డెరివేటివ్ కౌంటర్లలో అదానీ ఎంటర్, టాటా కెమికల్స్, ఎస్‌ఆర్ఎఫ్, నౌకరీ, అంబుజా సిమెంట్, బాటా ఇండియా, గోద్రెజ్ సీపీ 3.5-2.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఐడియా, ఐబీ హౌసింగ్, పీవీఆర్, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్, జీ 2.4-1.3 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,035 లాభపడగా.. కేవలం 527 నష్టాలతో కదులుతున్నాయి.