సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్‌గా పరిగణిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 553 పాయింట్ల నష్టంతో 35,119 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 156 పాయింట్లు కోల్పోయి 10,537 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠతో పాటు రూపాయి క్షీణత, ముడిచమురు ధరల పెరుగుదల, అమెరికా-చైనాల మధ్య వర్తక ఉద్రిక్తతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. రిలయన్స్ ఇండస్ర్టీస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, ఆసియన్ పెయింట్స్, కొటాక్ బ్యాంక్, వేదాంత, యస్ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్ సహా పలు షేర్లు నష్టాల బాట పట్టాయి. విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగుతుండగా, దేశీయ సంస్ధాగత మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment