కోవిడ్-19 కేసులు పెరుగుతూనే ఉన్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. తదుపరి పతన బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 315 పాయింట్లు క్షీణించి 37,292కు చేరగా.. నిఫ్టీ 84 పాయింట్ల నష్టంతో 10,989 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా ప్రయివేట్ రంగ బ్యాంక్ కౌంటర్లలో అమ్మకాలు పెరగడంతో మార్కెట్లు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఆటో జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రయివేట్ బ్యాంక్ ఇండెక్స్ 1.7 శాతం క్షీణించగా.. ఆటో 2 శాతం ఎగసింది. పీఎస్‌యూ బ్యాంక్స్ 0.5 శాతం బలపడింది. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, ఇండస్‌ఇండ్, కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ, గ్రాసిమ్, ఆర్‌ఐఎల్, ఇన్ఫోసిస్ 4.2-1 శాతం మధ్య నీరసించాయి. అయితే టాటా మోటార్స్ 7 శాతం జంప్‌చేయగా.. హీరో మోటో, ఐషర్, మారుతీ, ఎంఅండ్‌ఎం, బజాజ్ ఆటో, టైటన్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ, విప్రో 3.2-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి.
ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్ కౌంటర్లలో మదర్‌సన్, జూబిలెంట్ ఫుడ్, అశోక్ లేలాండ్, మైండ్‌ట్రీ, టీవీఎస్, పీఎన్‌బీ, మణప్పురం 3.6-2.3 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోవైపు బంధన్ బ్యాంక్ 8.5 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో టాటా కెమ్, ఐడియా, ఐసీఐసీఐ ప్రు 4.5-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 968 లాభపడగా.. 754 నష్టాలతో కదులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment