
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 400 పాయింట్లు జంప్‌చేయగా.. నిఫ్టీ లాభాల సెంచరీ చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్ 431 పాయింట్లు జంప్‌చేసి 39,128ను తాకగా.. నిఫ్టీ 118 పాయింట్లు ఎగసి 11,535 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన యూఎస్ మార్కెట్లు డీలాపడగా.. ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి.
ఐటీ, బ్యాంక్స్ జోరు
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా 0.6 శాతం క్షీణించగా మిగిలిన అన్ని రంగాలూ లాభపడ్డాయి. ఐటీ, ప్రయివేట్ బ్యాంక్స్ 2 శాతం చొప్పున పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్ 1 శాతం బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్, టాటా స్టీల్, విప్రో, టీసీఎస్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్ 5-1.3 శాతం మధ్య ఎగశాయి. కేవలం ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్, బీపీసీఎల్ అదికూడా 0.2 శాతం చొప్పున నీరసించాయి.
బంధన్ బ్యాంక్ అప్
డెరివేటివ్ కౌంటర్లలో బంధన్ బ్యాంక్, సెయిల్, ఆర్‌బీఎల్ బ్యాంక్, జిందాల్ స్టీల్, భారత్ ఫోర్జ్, పీవీఆర్, పిరమల్, కోఫోర్జ్ 4-2 శాతం మధ్య జంప్ చేశాయి. కాగా.. టొరంట్ ఫార్మా, ఐజీఎల్, జీ, లుపిన్, గ్లెన్‌మార్క్, అమరరాజా, సన్ టీవీ, ఎస్కార్ట్స్ 1.5-0.6 శాతం మధ్య బలహీనపడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,200 లాభపడగా.. 490 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment