
శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో బుల్ రంకెలేసింది. కొనుగోళ్ల అండతో ఉత్సాహంగా ఉరకలేసింది. దీంతో ఉదయం ప్రారంభం నుంచి దేశీయ మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ ఏకంగా 55,060 పాయింట్లను టచ్ చేసింది. దీంతో సెన్సెక్స్ 216.44 పాయింట్లు లాభపడి 55,060వద్ద కొనసాగుతుంది.
అదే సమయంలో నిఫ్టీ సైతం ఫ్రెష్ హై రికార్డ్ లను క్రియేట్ చేస్తూ 67 పాయింట్ల లాభంతో 16,441.25తో పరుగులు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా పెట్రోస్టాక్స్‌తో పాటు ఆటోమోబైల్, మెటల్ కంపెనీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఫార్మాషేర్లు నష్టాల‍్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment