కొద్ది రోజులుగా ఆటుపోట్ల మధ్య కన్సాలిడేషన్ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా హైజంప్ చేశాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 646 పాయింట్లు పెరిగి 38,840 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 171 పాయింట్లు జంప్‌చేసి 11,449 వద్ద స్థిరపడింది. బుధవారం మూడు రోజుల పతనానికి చెక్ పెడుతూ యూఎస్ మార్కెట్లు దూసుకెళ్లడం సెంటిమెంటుకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ట్రేడర్లు షార్ట్‌కవరింగ్ చేపట్టడం, ఇండెక్స్ హెవీవెయిట్ ఆర్‌ఐఎల్ దూకుడు చూపడం వంటి అంశాలు మార్కెట్లకు బలాన్నిచ్చినట్లు తెలియజేశారు. ఇంట్రాడేలో గరిష్టంగా సెన్సెక్స్ 38,878ను అధిగమించగా.. నిఫ్టీ 11,464ను తాకింది.
ప్రభుత్వ బ్యాంక్స్ జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్ 2.5 శాతం పుంజుకోగా.. ప్రయివేట్ బ్యాంక్స్, మీడియా, ఐటీ, రియల్టీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ 1.3-0.5 శాతం మధ్య బలపడ్డాయి. మెటల్ 1.2 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఆర్‌ఐఎల్ 7.3 శాతం జంప్‌చేసింది. దీంతో ఇండెక్సులు దూకుడు చూపగా.. బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, ఐవోసీ, యాక్సిస్, గ్రాసిమ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అల్ట్రాటెక్, ఇండస్‌ఇండ్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్, శ్రీ సిమెంట్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ 6-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్, హిందాల్కో, టాటా స్టీల్, ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్, అదానీ పోర్ట్స్, యూపీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, టైటన్, కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 5-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి.
అదానీ ప్లస్
డెరివేటివ్స్‌లో అదానీ ఎంటర్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, హెచ్‌పీసీఎల్, సన్ టీవీ, నౌకరీ, ఐడియా, కెనరా బ్యాంక్, అపోలో టైర్, ఎల్‌ఐసీ హౌసింగ్, ఏసీసీ, ఐసీఐసీఐ ప్రు 5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. ఐబీ హౌసింగ్, ఎన్‌ఎండీసీ, కంకార్, కేడిలా హెల్త్, సెయిల్, శ్రీరామ్ ట్రాన్స్, యూబీఎల్, ఎస్కార్ట్స్, బాటా 3.3-1.3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,824 లాభపడగా.. 887 మాత్రమే నష్టపోయాయి.
అమ్మకాల బాటలో
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 959 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 264 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1057 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు రూ. 620 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment