RIL up
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్@ రూ. 8 లక్షల కోట్లు
ముంబై, సాక్షి: ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త రికార్డ్ సాధించింది. తొలిసారి రూ. 8 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించింది. తద్వారా దేశీ లిస్టెడ్ కంపెనీలలో మూడో ర్యాంకును కైవసం చేసుకుంది. నేటి ట్రేడింగ్ ప్రారంభంలో దాదాపు 2 శాతం లాభపడటం ద్వారా రూ. 1464 వద్ద సరికొత్త గరిష్టాన్ని సైతం షేరు తాకింది. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 8 ట్రిలియన్లను దాటింది. వెరసి గరిష్ట మార్కెట్ క్యాప్‌ను సాధించిన తొలి ఫైనాన్షియల్ రంగ సంస్థగా నిలిచింది. 98 శాతం జూమ్ కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది మార్చిలో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు రూ. 739 వరకూ పతనమైంది. ఆ స్థాయి నుంచి ర్యాలీ బాట పట్టి తాజాగా రూ. 1464కు చేరింది. వెరసి 8 నెలల్లో 98 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో గత మూడు నెలల్లో 30 శాతం, గత నెల రోజుల్లో 17 శాతం చొప్పున బలపడుతూ వచ్చింది. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభం 18 శాతంపైగా ఎగసి రూ. 7,513 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ. 15,776 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 4.1 శాతంగా నమోదయ్యాయి. జాబితా ఇలా లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్స్‌లో ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 13.34 లక్షల కోట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టాటా గ్రూప్ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ రూ. 10.19 ట్రిలియన్ల విలువతో రెండో ర్యాంకులో నిలుస్తోంది. ఇదే విధంగా రూ. 5.08 లక్షల కోట్లతో ఎఫ్ఎంసీజీ బ్లూచిప్ కంపెనీ హెచ్‌యూఎల్, రూ. 4.83 ట్రిలియన్ల విలువతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 4, 5 ర్యాంకులను పొందుతున్నాయి. కాగా.. పోటీ సంస్థలతో పోలిస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రీమియంతో ట్రేడయ్యేందుకు అర్హత కలిగి ఉన్నట్లు విదేశీ రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ అభిప్రాయపడింది. పటిష్ట లాభదాయకత, నిలకడైన మార్జిన్లు, అండర్‌రైటింగ్ నాణ్యత వంటి పలు అంశాలు బ్యాంకునకు సానుకూల అంశాలుగా పేర్కొంది. దీంతో రూ. 1,700 టార్గెట్ ధరతో కొనుగోలుకి సిఫారసు చేస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 0.7 శాతం వెనకడుగుతో రూ. 1428 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1454 వద్ద గరిష్టాన్ని తాకగా, రూ. 1421 దిగువన కనిష్టాన్ని చవిచూసింది. -
రిలయన్స్ రిటైల్‌లో కార్లయిల్‌కు వాటా!
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్‌లో మరో పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా రిలయన్స్ రిటైల్‌లో 150-200 కోట్ల డాలర్ల(సుమారు రూ. 14,700 కోట్లు) వరకూ కార్లయిల్ గ్రూప్ ఇన్వెస్ట్ చేయవచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు రెండు కంపెనీల మధ్య చర్చలు నడుస్తున్నట్లు విశ్లేషకులు ఊహిస్తున్నారు. అయితే ఈ అంశంపై అటు ఆర్ఐఎల్, ఇటు కార్లయిల్ గ్రూప్ ప్రతినిధులు స్పందించలేదంటూ ఈ వార్తల విశ్లేషణ సందర్భంగా ఆంగ్ల మీడియా పేర్కొంది. కాగా, ఈ డీల్ కుదిరితే.. దేశీ కంపెనీలో కార్లయిల్ చేస్తున్న అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్గా నిలవనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా దేశీ రిటైల్ రంగ కంపెనీలో కార్లయిల్ తొలిసారి వాటా సొంతం చేసుకున్నట్లు అవుతుందని తెలియజేశారు. కాగా.. ఇటీవల రిలయన్స్ రిటైల్‌లో 1.75 శాతం వాటా కొనుగోలుకి పీఈ సంస్థ సిల్వర్ లేక్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. తద్వారా రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరినట్లు మార్కెట్‌వర్గాలు అంచనా వేశాయి కూడా! షేరు జోరు డిజిటల్ విభాగం జియో బాటలో రిలయన్స్ రిటైల్లోనూ వాటా విక్రయం ద్వారా భారీగా నిధుల సమీకరణ చేపట్టనున్న వార్తలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ పుట్టింది. ఎన్ఎస్ఈలో తొలుత ఆర్ఐఎల్ షేరు 2 శాతం ఎగసి రూ. 2,360ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 0.7 శాతం లాభపడి రూ. 2,335 వద్ద ట్రేడవుతోంది. మరోపక్క ఆర్ఐఎల్ పీపీ షేరు సైతం 3 శాతం పుంజుకుని రూ. 1462కు చేరింది. దీంతో ఉదయం సెషన్లో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 16.5 లక్షల కోట్లను తాకింది. వారాంతాన ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ. 15 లక్షల కోట్లు(200 బిలియన్ డాలర్లు)ను అధిగమించడం ద్వారా దేశీ స్టాక్ మార్కెట్ల చరిత్రలో కొత్త రికార్డును లిఖించిన సంగతి తెలిసిందే. -
ఆర్ఐఎల్ దన్ను- 646 పాయింట్ల హైజంప్
కొద్ది రోజులుగా ఆటుపోట్ల మధ్య కన్సాలిడేషన్ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా హైజంప్ చేశాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ 646 పాయింట్లు పెరిగి 38,840 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 171 పాయింట్లు జంప్‌చేసి 11,449 వద్ద స్థిరపడింది. బుధవారం మూడు రోజుల పతనానికి చెక్ పెడుతూ యూఎస్ మార్కెట్లు దూసుకెళ్లడం సెంటిమెంటుకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ట్రేడర్లు షార్ట్‌కవరింగ్ చేపట్టడం, ఇండెక్స్ హెవీవెయిట్ ఆర్ఐఎల్ దూకుడు చూపడం వంటి అంశాలు మార్కెట్లకు బలాన్నిచ్చినట్లు తెలియజేశారు. ఇంట్రాడేలో గరిష్టంగా సెన్సెక్స్ 38,878ను అధిగమించగా.. నిఫ్టీ 11,464ను తాకింది. ప్రభుత్వ బ్యాంక్స్ జోరు ఎన్ఎస్ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్ 2.5 శాతం పుంజుకోగా.. ప్రయివేట్ బ్యాంక్స్, మీడియా, ఐటీ, రియల్టీ, ఆటో, ఎఫ్ఎంసీజీ 1.3-0.5 శాతం మధ్య బలపడ్డాయి. మెటల్ 1.2 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో ఆర్ఐఎల్ 7.3 శాతం జంప్‌చేసింది. దీంతో ఇండెక్సులు దూకుడు చూపగా.. బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్, ఐవోసీ, యాక్సిస్, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అల్ట్రాటెక్, ఇండస్ఇండ్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్, శ్రీ సిమెంట్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ 6-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇన్ఫ్రాటెల్, హిందాల్కో, టాటా స్టీల్, ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్, అదానీ పోర్ట్స్, యూపీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, టైటన్, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 5-0.4 శాతం మధ్య డీలాపడ్డాయి. అదానీ ప్లస్ డెరివేటివ్స్‌లో అదానీ ఎంటర్, ఐడీఎఫ్సీ ఫస్ట్, హెచ్‌పీసీఎల్, సన్ టీవీ, నౌకరీ, ఐడియా, కెనరా బ్యాంక్, అపోలో టైర్, ఎల్ఐసీ హౌసింగ్, ఏసీసీ, ఐసీఐసీఐ ప్రు 5-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. ఐబీ హౌసింగ్, ఎన్ఎండీసీ, కంకార్, కేడిలా హెల్త్, సెయిల్, శ్రీరామ్ ట్రాన్స్, యూబీఎల్, ఎస్కార్ట్స్, బాటా 3.3-1.3 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,824 లాభపడగా.. 887 మాత్రమే నష్టపోయాయి. అమ్మకాల బాటలో నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 959 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 264 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1057 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు రూ. 620 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. -
వారెవ్వా రిలయన్స్.. రూ. 15 లక్షల కోట్లకు!
ఇటీవల కొత్త చరిత్రను సృష్టిస్తూ సాగుతున్న డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా మరిన్ని రికార్డులను సాధించింది. అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌లో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌కు వాటాను ఆఫర్ చేసిందన్న వార్తలతో ఆర్ఐఎల్ షేరుకి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వెరసి ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 8.4 శాతం దూసుకెళ్లింది. రూ. 2,345కు చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) ఏకంగా రూ. 15 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో తొలిసారి ఈ ఘనతను సాధించిన దిగ్గజ కంపెనీగా ఆర్ఐఎల్ నిలిచింది! 11 శాతం అప్ రిలయన్స్ రిటైల్‌లో 1.75 శాతం వాటాను పీఈ సంస్థ సిల్వర్ లేక్‌కు విక్రయించడం ద్వారా ఆర్ఐఎల్ షేరు జోరందుకుంది. వెరసి రెండు రోజుల్లోనే ఈ షేరు 11 శాతం ర్యాలీ చేసింది. 1.75 శాతం వాటా కోసం సిల్వర్ లేక్ రూ. 7,500 కోట్లను ఇన్వెస్ట్ చేయనుండటంతో రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరింది. పీఈ కంపెనీ కేకేఆర్ రిలయన్స్ రిటైల్‌లో 1.5 బిలియన్ డాలర్లవరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు సౌదీ ఫండ్స్ సైతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. తాజాగా రిలయన్స్ రిటైల్‌లో అమెజాన్‌కు 20 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,45,000 కోట్లు) విలువైన వాటాను ఆర్ఐఎల్ ఆఫర్ చేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఈ అంశంపై ఇరు కంపెనీలూ స్పందించనప్పటికీ షేరు దూకుడు చూపుతుండటం గమనార్హం! -
రిలయన్స్ చేతికి నెట్‌మెడ్స్
దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఆన్లైన్ ఫార్మసీ సంస్థ నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. రూ. 620 కోట్లు వెచ్చించడం ద్వారా నెట్‌మెడ్స్‌లో 60 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు ఆర్ఐఎల్ తాజాగా వెల్లడించింది. దీంతో డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో.. ఈకామర్స్ రంగంలో ఔషధ విభాగంలోకి సైతం ప్రవేశించేందుకు వీలు కలిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే జియోమార్ట్ పేరుతో ఆన్లైన్ గ్రాసరీ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఆర్ఐఎల్ డీల్ ప్రకారం నెట్‌మెడ్స్ విలువను రూ. 1,000 కోట్లుగా విశ్లేషకులు అంచనా వేశారు. గత వారమే ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. బెంగళూరులో ఆన్లైన్ ఫార్మసీ విక్రయాలు ప్రారంభించింది. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఆర్ఐఎల్ నెట్‌మెడ్స్ కొనుగోలుతో పోటీ వేడెక్కనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా నెట్‌మెడ్స్, ఫార్మ్ఈజీ, మెడ్‌లైఫ్ తదితర పలు కంపెనీలు ఆన్లైన్ ద్వారా ఔషధ విక్రయాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. నెట్‌మెడ్స్ కథ.. ప్రదీప్ దాధా ఏర్పాటు చేసిన నెట్‌మెడ్స్ ఆన్లైన్ ద్వారా ఔషధాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను విక్రయిస్తోంది. వెబ్సైట్, యాప్‌ల ద్వారా వినియోగదారులకు పిల్లల సంరక్షణ ఉత్పత్తులతోపాటు.. డాక్టర్ల ఆపాయింట్మెంట్ సేవలను సైతం సమకూర్చుతోంది. ఏడాది కాలంగా సరైన ధర లభిస్తే వ్యాపారాన్ని విక్రయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. నెట్‌మెడ్స్‌లో ఇప్పటికే సింగపూర్ సంస్థ డాన్ పెన్ కాంబోడియా గ్రూప్, సిస్టెమా ఏషియా ఫండ్, ఆర్బిమెండ్ తదితరాలు ఇన్వెస్ట్ చేశాయి. -
అర్బన్ ల్యాడర్‌పై ఆర్ఐఎల్ కన్ను!
ఈకామర్స్‌లో వ్యాపార విస్తరణకు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే కిశోర్ బియానీ గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్‌ను విలీనం చేసుకునే యోచనలో ఉన్న ఆర్ఐఎల్ దేశీయంగా మరికొన్ని కంపెనీల కొనుగోలుకి చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా ఆన్లైన్ ఫర్నీచర్ కంపెనీ ఆర్బన్ ల్యాడర్‌పై దృష్టిపెట్టినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఇదే విధంగా మిల్క్ డెలివరీ సంస్థ మిల్క్‌బాస్కెట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేసింది. తుది దశలో అర్బన్ ల్యాడర్‌తో కొద్ది నెలలుగా జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అర్బన్ ల్యాడర్‌తో 3 కోట్ల డాలర్లు(రూ. 225 కోట్లు) డీల్ కుదిరే వీలున్నట్లు అంచనాలున్నాయి. కాగా.. మరోవైపు ఈఫార్మసీ స్టార్టప్ నెట్మెడ్స్తోపాటు.. లింగరీ రిటైలర్ జివామీలోనూ మెజారిటీ వాటా కొనుగోలుకి రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్చలు ప్రారంభించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆర్ఐఎల్వైపు చూపు! మిల్క్‌బాస్కట్ గతంలో ఆన్లైన్ గ్రోసరీస్ సంస్థ బిగ్బాస్కెట్తోపాటు.. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌తో నిర్వహించిన చర్చలు విఫలమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో తాజాగా ఆర్ఐఎల్ ప్రతినిధులతో మిల్క్‌బాస్కట్ సంప్రదింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఇటీవల 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించడంతో ఇందుకు వేచిచూసే ధోరణితో మిల్క్‌బాస్కట్ ఉన్నట్లు మీడియా పేర్కొంది. 1.5 కోట్ల డాలర్ల విలువను మిల్క్‌బాస్కట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కోవిడ్-19 కారణంగా ఇటీవల మిల్క్ ప్రొడక్టులతోపాటు.. గ్రోసరీస్‌కు సైతం డిమాండ్ పెరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆన్లైన్ వ్యాపార విస్తరణకు పలు అవకాశాలు లభిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేస్తున్నాయి. -
చివర్లో రికవరీ- మార్కెట్లు అక్కడక్కడే
నష్టాలతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు చివరి గంటలో సాధించిన రికవరీతో ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ నామమాత్రంగా 12 పాయింట్లు క్షీణించి 38,129 వద్ద నిలవగా.. నిఫ్టీ 21 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,194 వద్ద స్థిరపడింది. అమెరికా నుంచి ఆసియా వరకూ మార్కెట్లు బలహీనపడటంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ఆసక్తి చూపారు. దీంతో 37,949 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 37,748 వరకూ నీరసించింది. చివర్లో 38,236 వరకూ పుంజుకుంది. ఇక నిఫ్టీ సైతం తొలుత 11,090 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకగా.. తదుపరి 11,225 వరకూ ఎగసింది. మీడియా, ఆటో, ఫార్మా డీలా ఎన్ఎస్ఈలో ఐటీ(1.4 శాతం) మాత్రమే లాభపడగా.. బ్యాంకింగ్, రియల్టీ, మీడియా, ఆటో, ఫార్మా 1.8-0.8 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, హిందాల్కో, యాక్సిస్, ఎస్బీఐ, గెయిల్, గ్రాసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ, ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్ 5-2.3 శాతం మధ్య నష్టపోయాయి. ఇతర బ్లూచిప్స్‌లో హెచ్‌సీఎల్ టెక్, ఆర్ఐఎల్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఇండస్ఇండ్, ఇన్ఫోసిస్, విప్రొ 4.7-1.3 శాతం మధ్య ఎగశాయి. రిలయన్స్ రిటైల్‌లో అమెజాన్ వాటా కొనుగోలు చేయనుందన్న అంచనాలతో ఆర్ఐఎల్ రూ. 2163 వద్ద సరికొత్త గరిష్టాన్ని చేరింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 14 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి దేశీయంగా లిస్టెడ్ కంపెనీల చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఫైనాన్స్ వీక్ డెరివేటివ్ కౌంటర్లలో చోళమండలం, ఎంఅండ్ఎం ఫైనాన్స్, పెట్రోనెట్, ఉజ్జీవన్, బయోకాన్, ఎస్కార్ట్స్ 4.6-3.6 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే ఐడీఎఫ్సీ ఫస్ట్, నిట్ టెక్, ఆర్బీఎల్ బ్యాంక్, జీఎంఆర్, మారికో, అంబుజా సిమెంట్ 4.4-1.6 శాతం మధ్య ఎగశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6-0.25 శాతం మధ్య డీలాపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1583 నష్టపోగా.. 1070 లాభపడ్డాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1740 కోట్లకుపైగా విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 932 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం సైతం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1666 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1139 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
ఆర్ఐఎల్- రోజారీ బయోటెక్ రయ్రయ్
ఇటీవల ప్రతిరోజూ సరికొత్త గరిష్టాలను తాకుతున్న డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్(ఆర్ఐఎల్)కు మరోసారి డిమాండ్ నెలకొంది. దీంతో పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ ఆర్ఐఎల్ షేరు మరోసారి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో గురువారం భారీ లాభాలతో లిస్టయిన స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ రోజారీ బయోటెక్ వరుసగా రెండో రోజూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ లాభాలతో కళకలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఆర్ఐఎల్ రికార్డ్ డిజిటల్ అనుబంధ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు విదేశీ దిగ్గజాలు క్యూకట్టడం, రైట్స్ ఇష్యూ పూర్తి నేపథ్యంలో ఆర్ఐఎల్ కౌంటర్లో ర్యాలీ కొనసాగుతోంది. కంపెనీ ఇప్పటికే రుణరహితంకావడంతోపాటు రిలయన్స్ రిటైల్, జియోమార్ట్ వంటి విభాగాలపైనా వ్యూహాత్మక ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్న వార్తలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో నేటి ట్రేడింగ్‌లో ఎన్ఎస్ఈలో తొలుత ఆర్ఐఎల్ షేరు రూ. 2150కు చేరింది. ఇది ఆల్‌టైమ్ హై.. కాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 2120 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ) రూ. 14 లక్షల కోట్లను తాకడం గమనార్హం! గత నెల రోజుల్లో ఆర్ఐఎల్ షేరు 22 శాతం లాభపడిన సంగతి తెలిసిందే. రోజారీ బయోటెక్ గత ఐదేళ్ల కాలంలో లిస్టయిన తొలి రోజే 75 శాతం జంప్‌చేయడం ద్వారా రికార్డ్ సృష్టించిన రోజారీ బయోటెక్ వరుసగా రెండో రోజు లాభాలతో దూసుకెళ్లింది. ఎన్ఎస్ఈలో తొలుత 7 శాతం ఎగసి రూ. 794కు చేరింది. ఇది సరికొత్త గరిష్టంకాగా తదుపరి వెనకడుగు వేసింది. ప్రస్తుతం స్వల్ప లాభంతో రూ. 743 వద్ద ట్రేడవుతోంది. ఈ నెల రెండో వారంలో ఐపీవో పూర్తిచేసుకున్న రోజారీ బయోటెక్ గురువారం భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 425కాగా.. చివరికి 75 శాతం లాభంతో రూ. 742 వద్ద ముగిసింది. గత ఐదేళ్ల కాలంలో 11 కంపెనీలు మాత్రమే లిస్టింగ్‌లో 50 శాతానికిపైగా లాభపడినట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. తొలి రోజు బీఎస్ఈలో ఇంట్రాడేలో రూ. 804 వద్ద గరిష్టాన్ని తాకగా.. ఈ కౌంటర్లో 30 లక్షలకుపైగా షేర్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. -
సిప్లా- ఆర్ఐఎల్.. రికార్డుల హోరు
సెంటిమెంటు బలపడటంతో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తొలుత సెన్సెక్స్ 450 పాయింట్లకుపైగా జంప్ చేసింది. 35,211ను తాకింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 35,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. తదుపరి కాస్త వెనకడుగు వేసింది. ప్రస్తుతం 158 పాయింట్లు బలపడి 35,890 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఓవైపు ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, మరోపక్క ఫార్మా దిగ్గజం సిప్లా లిమిటెడ్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. వివరాలు చూద్దాం.. సిప్లా లిమిటెడ్ కోవిడ్-19 చికిత్సకు వినియోగించగల ప్రయోగాత్మక ఔషధం రెమ్డిసివిర్ తయారీ, విక్రయాలకు దేశీ ఔషధ నియంత్రణ సంస్థ డీజీసీఐ నుంచి అనుమతి లభించినట్లు సిప్లా లిమిటెడ్ పేర్కొంది. దీంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో తొలుత ఈ షేరు దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. రూ. 692ను అధిగమించడం ద్వారా రికార్డ్ గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 4.5 శాతం లాభంతో రూ. 665 వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్ దిగ్గజం గిలియడ్ సైన్సెస్ రూపొందించిన రెమ్‌డెసివిర్‌కు జనరిక్ ఔషధ తయారీ, విక్రయాలకు అనుమతి లభించినట్లు సిప్లా పేర్కొంది. సెప్రెమీ పేరుతో ఈ ఔషధాన్ని అత్యవసర ప్రాతిపదికన మాత్రమే వినియోగించేందుకు అనుమతి లభించినట్లు తెలియజేసింది. అమెరికాలో కరోనా వైరస్ సోకిన రోగులకు అత్యవసర చికిత్స నిమిత్తం రెమ్‌డెసివిర్‌ను వినియోగించేందుకు యూఎస్ఎఫ్డీఏ అనుమతిని గిలియడ్ పొందింది. ఈ ఔషధానికి గిలియడ్ నుంచి నాన్ఎక్స్క్లూజివ్ లైసెన్స్‌ను సిప్లా గత నెలలోనే సంపాదించిన విషయం విదితమే. రిలయన్స్ జోరు డిజిటల్, టెలికం అనుబంధ విభాగం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో విదేశీ సంస్థలపెట్టుబడులు వెల్లువెత్తిన నేపథ్యంలో జోరందుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్ మరోసారి దూకుడు చూపుతోంది. ఎన్ఎస్ఈలో తొలుత 2.6 శాతం ఎగసి రూ. 1804ను అధిగమించింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. ప్రస్తుతం 0.5 శాతం లాభంతో రూ. 1768 వద్ద ట్రేడవుతోంది. గత మూడు నెలల్లో ఈ షేరు 104 శాతం దూసుకెళ్లింది. మార్చి 23న ఈ షేరు రూ. 884 వద్ద కనిష్టానికి చేరాక ర్యాలీ బాట పట్టింది. గత మూడు రోజుల్లోనే ఆర్ఐఎల్ షేరు 12 శాతం ర్యాలీ చేసింది. తద్వారా తాజాగా రూ. 11 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించింది. దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక కంపెనీ 150 బిలియన్ డాలర్ల విలువను సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం! -
ముకేశ్ అంబానీ గ్రూప్ షేర్ల హవా
గత నెల రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నప్పటికీ దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీలు మాత్రం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. దీంతో గత నెల రోజుల్లో ఆటుపోట్ల మధ్య ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 8 శాతమే బలపడగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఎంటర్టైన్మెంట్, మీడియా కంపెనీల షేర్లు 46-98 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఈ బాటలో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ప్రాస్ట్రక్చర్ సైతం 12 శాతం స్థాయిలో పుంజుకోవడం గమనార్హం! జియో ఎఫెక్ట్? మొబైల్, డిజిటల్ సర్వీసుల అనుబంధ కంపెనీ రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా కొనుగోలుకి విదేశీ దిగ్గజాలు క్యూ కట్టినప్పటి నుంచీ మాతృ సంస్థ ఆర్ఐఎల్ జోరందుకుంది. జియో ఇన్ఫోకామ్‌లో 22 శాతం వాటా విక్రయంతో రూ. 1.04 లక్షల కోట్లను సమీకరించగా.. రైట్స్ ఇష్యూ ద్వారా ఆర్ఐఎల్ రూ. 53,000 కోట్లకుపైగా సమకూర్చుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గ్రూప్‌లో ప్రధాన కంపెనీ ఆర్ఐఎల్ రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు.. ఇతర బిజినెస్‌ల విస్తరణపై దృష్టిసారించనున్నట్లు నిపుణలు పేర్కొంటున్నారు. దీంతో గ్రూప్‌లోని కంపెనీల షేర్లకు డిమాండ్ పెరిగినట్లు తెలియజేశారు. జోరు తీరిలా ముకేశ్ అంబానీ గ్రూప్‌లోని ఆర్ఐఎల్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ప్రాస్ట్రక్చర్ గత నెల రోజుల్లో 11 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ఫలితంగా ఆర్ఐఎల్ షేరు మంగళవారం(16న) రూ. 1648 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది కూడా. ఈ బాటలో ఇతర కౌంటర్లు మరింత జోరందుకున్నాయి. హాథవే భవానీ కేబుల్టెల్ 98 శాతం ఎగసి రూ. 16 నుంచి రూ. 32కు చేరింది. టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్ 75 శాతం జంప్‌చేసి రూ. 22 నుంచి రూ. 38కు ఎగసింది. నెట్వర్క్ 18 మీడియా రూ. 25 నుంచి రూ. 40కు చేరింది. ఇది 61 శాతం వృద్ధికాగా..డెన్ నెట్వర్క్స్ 53 శాతం పురోగమించి రూ. 80ను తాకింది. ఇదే విధంగా హాథవే కేబుల్ 46 శాతం పుంజుకుని రూ. 34ను అధిగమించగా.. రిలయన్స్ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా 12 శాతం బలపడి రూ. 306కు చేరింది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
లాభాల ముగింపు : ఆర్ఐఎల్ 4శాతం జంప్
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. భారీ లాభాలనుంచి వెనక్కి తగ్గినా వరుసగా ఐదవ సెషన్లో కీలక సూచీలు లాభాల దౌడు తీశాయి. ఒక దశలో 295 పాయింట్ల వరకు ఎగిసిన సెన్సెక్స్ చివరకు 192 పాయింట్ల లాభాలతో 36,578 వద్ద , నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 10,961 ముగిసింది. 11వేల స్థాయి సమీపంలో ముగిసింది. ఐటీ, ఆయిల్ అండ్‌గ్యాస్, ఫార్మ షేర్లు లాభపడ్డాయి. రియల్టీ,ఆ టో,పీ ఎస్‌యూ బ్యాంక్స్ షేర్లు నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 4 శాతం లాభపడింది. కొటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, గెయిల్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టాప్ విన్నర్స్‌గా ఉండగా హీరోమోటో, యస్ బ్యాంక్, విప్రో, మారుతీ, బజాజ్ ఆటో, ఐబీ హౌసింగ్, ఐవోసీ, గ్రాసిమ్, పవర్‌గ్రిడ్, ఓఎన్జీసీ నష్టపోయినవాటిల్లో ఉన్నాయి. మరోవైపు దేశీయ కరెన్సీ రుపీ నష్టాల్లో ముగిసింది. 12పైసలు నష్టపోయి 71.28 వద్ద స్థిరపడింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 62.94 వద్ద రెండు నెలల గరిష్టాన్ని తాకింది. దీంతో రుపాయి బలహీనపడింది. -
జియో జోష్: రిలయన్స్ , టెలికాం షేర్ల రింగింగ్
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరోసారి ఆల్ టైం హైని నమోదు చేసింది. మార్కెట్ క్యాప్ లో రూ. 6 లక్షల కోట్ల మార్క్‌ను తాకింది. సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 6లక్షలకోట్లను దాటిన మొట్టమొదటి కంపెనీగా నిలిచింది. రిలయన్స్ కు చెందిన టెలికాం కంపెనీ జియో తారిఫ్ లను భారీగా పెంచిన నేపథ్యంలో ఈ రికార్డ్ సాధించింది. ఆర్ఐ ఎల్ షేరు ధర రూ.936 వద్ద ట్రేడ్ అవుతూ మార్కెట్‌కు పూర్తి మద్దతునిస్తోంది. జియో బ్రాండుతో టెలికం కంపెనీలకు ప్రధాన పోటీదారుగా నిలుస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల 4జీ టారిఫ్ ధరలను 15-20 శాతంమేర పెంచడం, వేలిడిటీ కాలాన్ని సైతం తగ్గించడం వంటి అంశాలు దీనికి దోహదం చేసినట్టు మార్కెట్ వర్గాలుభావిస్తున్నాయి. మరోవైపు జియో తారిఫ్ రేట్ల పెంపుజోష్‌తో, ఇటీవలి విలీనాలు టెలికాం షేర్లన్నీ మెరుపులు మెరిపించాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ముఖ్యంగా దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్టెల్, ఐడియా టాప్ విన్నర్స్‌గా ఉండగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా లాభాల్లో కొనసాగుతోంది. దీనికితోడు కామన్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో నెట్‌వర్క్‌ను పంచుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతుండటంతో టెలికం రంగంలో వ్యయాలు దిగిరానున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. -
రెండేళ్ల గరిష్టంలో నిఫ్టీ
ముంబై : డబుల్ సెంచరీని క్రాస్ చేసిన సెన్సెక్స్ 29వేల మార్కును పునరుద్ధరించుకుంది. 215.74 పాయింట్ల లాభంలో 29048.19 వద్ద క్లోజైంది. నిఫ్టీ సైతం రెండేళ్ల గరిష్టంలో 8950పైకి 65.90 పాయింట్ల లాభాలోకి ఎగిసింది. ఐటీ, ఫార్మా మినహా మిగతా అన్ని రంగాల షేర్లలో కొనుగోలు మద్దతు లభించడంతో మార్కెట్లు లాభాలు పండించాయి.. రిలయన్స్ ఇండస్ట్రీస్ 4 శాతం మేర పైకి దూసుకెళ్లింది. ఏప్రిల్ నుంచి రిలయన్స్ జియోపై చార్జీలు వసూలు చేయనుందనే నేపథ్యంలో మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు లాభాలు పండిస్తున్నాయి. వచ్చే ఏడాది లేదా రెండేళ్లలో కంపెనీ రూ.100,000 కోట్ల రెవెన్యూలను ఆర్జించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో హెచ్1-బీ వీసా ప్రక్రియపై సరియైన స్పష్టత రాకపోతుండటంతో ఐటీ సెక్టార్ సోమవారం మార్కెట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రోలు నష్టాలు గడించాయి. వాటితో పాటు ఫార్మా కంపెనీలు సన్ ఫార్మా, గ్రాసిమ్ షేర్లు కూడా ఒత్తిడినే ఎదుర్కొన్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.11 పైసల లాభంతో 66.70గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10గ్రాముల బంగారం ధర రూ.29,096గా ట్రేడైంది.