దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 9:54 గంటల సమయానికి సెన్సెక్స్ 58 వేల మార్క్ ను క్రాస్ చేసి సరికొత్త రికార్డ్‌లను క్రియేట్ చేసి 119 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 60.75 పాయింట్ల లాభంతో 17,294 వద్ద ట్రేడింగ్ కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో బీఎస్‌ఈ 30 సూచీలో దాదాపు సగానికిపైగా కంపెనీల షేర్ల లాభాలు కంటిన్యూ అవుతున్నాయి.
వీటిలో కొటాక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, టైటన్,ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ఉండగా హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, ఎంఅండ్‌ఎం, టెక్ మహీంద్రా, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, మారుతీ షేర్లు నష్టాల బాట పట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment