
ముంబై : దేశీ స్టాక్ మార్కెట్‌లో ఆరంభ లాభాలు ఆవిరైపోయాయి. అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా ప్రతికూల ఫలితాలు వెలువడటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడ్డారు. ఈ రోజుతో ఈ వారం మార్కెట్ ముగిసిపోతుండటంతో ఆరంభంలో కొనుగోళ్ల జోరు కనిపించినా అది తాత్కాలికమే అయ్యింది. అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం ఇన్వెస్టర్లను రిస్క్ నుంచి వెనుకడుగు వేసేలా చేసింది.
ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ 58,910 పాయింట్ల దగ్గర ఫుల్ జోష్‌లో ప్రారంభమైంది. ఒక దశలో 59,003 పాయింట్ల గరిష్టాలను తాకింది. ఆ తర్వాత గంటన్న తర్వాత ఒడిదుడుకులు మొదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి వరుసగా పాయింట్లూ కోల్పోతూ వచ్చింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 237 పాయింట్లు నష్టపోయి 58,338 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఆరంభం జోరు కొద్ది సేపే నిలిచి ఉంది. మార్కెట్ ముగిసే సమయానికి 54 పాయింట్లు నష్టపోయి 17,475 పాయింట్ల దగ్గర ఆగింది.
- ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతుందనే ప్రకటన రావడంతో ముడి చమురు ధరలు మళ్లీ ఎగిశాయి.
- గడిచిన 17 నెలల్లో అత్యధిక రిటైల్ ద్రవ్యోల్బణం (6.95 శాతం) దేశీయంగా నమోదు అయ్యింది.
- అమెరికాలో పదహారు నెలల తర్వాత మంత్లీ కన్సుమర్ ప్రైసెస్ పెరిగాయి
- బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టాలకు చేరుకుంది
Comments
Please login to add a commentAdd a comment