ముంబై: నాలుగు రోజుల వరుస నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లోకి వెళ్లాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు నిర్ణయం తీసుకోవడంతో క్రితం రోజు మార్కెట్ సూచీలు భారీగా పతనం అయ్యాయి. దీంతో కనిష్టాల వద్ద షేర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి మళ్లుతుంటూ ఆ స్థానాన్ని దేశీ ఇన్వెస్టర్లు ఆక్రమిస్తున్నారు.
ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ భారీ లాభాలతో ఆరంభమైంది. క్రితం రోజు ఎనిమిది నెలల కనిష్టాలకు పడిపోయి 52,541 పాయింట్లకు పడిపోయింది. కానీ గురువారం ఉదయం నాలుగు వందలకు పైగా పాయింట్ల లాభంతో 53,018 పాయింట్ల దగ్గర మొదలైంది. ఉదయం 9:20 గంటలకు 498 పాయింట్ల లాభంతో 53,040 దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో 15,850 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. స్మాల్, మిడ్, బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment