ముంబై : గత వారం భారీ నష్టాలను చవి చూసిన స్టాక్ మార్కెట్ ఈ వారం లాభాలతో ఆరంభమైంది. కనిష్టాల వద్ద షేర్లు లభిస్తుండటంతో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా సోమవారం ఉదయం మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ఉన్నాయి. అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా మార్కెట్‌కు ఊపును తెచ్చే ఘటనలు ఏమీ చోటు చేసుకోపోయినా ప్రస్తుతానికి సూచీలు లాభాల్లోనే ఉన్నాయి.
ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ వంద పాయింట్లకు పైగా లాభంతో 51,470 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు ఉండటంతో వరుసగా పాయింట్లు పెరుగుతూ పోతోంది. ఉదయం 9:30 గంటల సమయానికి 212 పాయింట్లు లాభపడి 51,572 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది,. మరోవైపు నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 15,334 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.
సన్‌ఫార్మా, ఏషియన్ పేయింట్స్, అపోలో హస్పిటల్స్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడగా ఎఎన్‌జీసీ, కోల్ ఇండియా, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీ షేర్లు కూడా లాభాల్లో కదలాడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment