
గ్లోబల్ మార్కెట్లలో సానుకూల ధోరణి కనిపించడంతో..బుధవారం రోజున భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు లాభాలతో మొదలైనాయి.. అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలతో ఆసియా మార్కెట్లు లాభాలతో ట్రేడ్ అయ్యాయి.
బుధవారం రోజున బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభ ట్రేడ్‌లో 238 పాయింట్లు లేదా 0.41 శాతం పెరిగి 58,814 వద్దకు చేరుకోగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 74 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 17,604 ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ మిడ్‌క్యాప్-100, 0.82 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ షేర్లు 1.07 శాతం పెరగడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు బలమైన లాభాలతో ట్రేడవుతున్నాయి.
టాటా స్టీల్, హిందుస్థాన్ యూనిలీవర్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టి, ఎం అండ్ ఎం, ఐటిసి లాభాల్లో ట్రేడ్ అవుతునాయి. మరోవైపు టైటాన్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.