
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాలపాలయ్యాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే రీతిలో కొనసాగాయి. సూచీలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం తీవ్రంగా పడింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల భారత్‌పై ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి వ్యవహారాల విభాగం(యూఎన్‌సీటీఏడీ) కీలక వ్యాఖ్యలు చేయడంతో దేశీయ ముదుపర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో, సూచీలు నష్టాలతో ముగిశాయి.
ముగింపులో, సెన్సెక్స్ 233.48 పాయింట్లు(0.41%) క్షీణించి 57362.20 వద్ద ఉంటే, నిఫ్టీ 69.80 పాయింట్లు(0.41%) నష్టపోయి 17153 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 76.20 వద్ద ముగిసింది. టైటాన్, టెక్ మహీంద్రా, మారుతి సుజుకి ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఐషర్ మోటార్స్, నెస్లే ఇండియా, టీసీఎస్ ఎక్కువగా నష్టపోతే.. ఎస్‌బీఐ, డాక్టర్ రెడ్డీస్, కొటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ సూచీలు రాణించాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఐటీ షేర్లు అర శాతానికి పైగా నష్టపోగా.. రియల్టీ లాభాల్లో ముగిసింది.
(చదవండి: పంక్చర్లకీ చెక్..!ఈ టైర్లు వాటంతంటా అవే సెల్ఫ్ హీల్..!)
Comments
Please login to add a commentAdd a comment