అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్‌లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగా చైనా ఆర్ధిక మాంధ్యంలో కొట్టుమిట్టాడుతుంది. బ్లూంబెర్గ్ రిపోర్ట్ ప్రకారం..ఈ ఏడాది తొలి వార్షిక ఫలితాల్లో చైనా ఆర్ధిక వ్యవస్థలో కీలక ఉన్న మూడవ వంతు ప్రాంతాల్లో కరోనా కోరలు చాచింది. దీంతో చైనా వృద్ధిరేటు ఊహించిన స్థాయిలో లేకపోవడం,ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి పరిణామాలు దేశీయ సూచీలపై ప్రభావం చూపించాయి.
ఫలితంగా బుధవారం ఉదయం 10గంటల సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 355 పాయింట్లు నష్టపోయి 57001 వద్ద నిఫ్టీ 125పాయింట్లు నష్టపోయి 17075 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. రిలయన్స్, హీరో మోటో కార్పొరేషన్,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హిందాల్కో,విప్రో, అపోలో హాస్పిటల్, బీపీసీఎల్, కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment