
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఒడిదోడుకులు ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, చమురు ధరలు పెరుగుతుండటం మదుపర్లపై ప్రభావం చూపింది. దీంతో, సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. చివరకు సెన్సెక్స్ 89.14 పాయింట్లు(0.15) శాతం క్షీణించి 57,595.68 వద్ద ఉంటే, నిఫ్టీ 22.90 పాయింట్లు(0.13 శాతం) నష్టపోయి 17,222.80 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.38 వద్ద ఉంది.
నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, కోల్ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా షేర్లు ఎక్కువ లాభపడితే.. కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, ఫార్మా ఇండెక్స్లు 1 శాతం చొప్పున పెరిగితే, బ్యాంక్ ఇండెక్స్ 1 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ & స్మాల్‌క్యాప్ సూచీలు స్వల్పంగా పెరిగాయి.
(చదవండి: అమెజాన్ బంపరాఫర్, ఉచితంగా 500కోర్సులు..అస్సలు మిస్సవ్వద్దు!)
Comments
Please login to add a commentAdd a comment