
ముంబై: ఫిబ్రవరి ద్రవ్యోల్బణం ఫలితాలు పెరిగినా అంతర్జాతీయ చమురు ధరలు దిగిరావడం, రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య మరోసారి వర్చువల్‌గా చర్చలు ప్రారంభం అవుతాయనే వార్తల నేపథ్యంలో మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొంది. దీంతో మరోరోజు దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి.
ఉదయం 9:10 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 177 పాయింట్లు లాభపడి 56,663 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 16,900 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. 1700 పాయింట్ల దగ్గర తీవ్ర నిరోధకం ఎదురుకావచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.