
ముంబై: బేర్ పంజాతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే రీతిలో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మరోసారి చమురు ధరలు పెరుగుతుండడం మదుపరులను కలవరపెడుతోంది. గత వారం 99 డాలర్ల వద్ద ఉన్న బ్యారెల్ చమురు ధర ఇప్పుడు 110 డాలర్లకు చేరింది. దీంతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, కొన్ని దేశాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి, లాక్‌డౌన్‌ల విధింపు వంటి అంశాలు మార్కెట్లను ఎక్కువగా ప్రభావితం చేశాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలను భారీ ఎదుర్కోవాల్సి వచ్చింది.
ముగింపులో, సెన్సెక్స్ 571.44 పాయింట్లు(0.99 శాతం) క్షీణించి 57292.49 వద్ద నిలిస్తే, నిఫ్టీ 69.40 పాయింట్లు(0.98 శాతం) నష్టపోయి 17,117.60 వద్ద ట్రేడవుతున్నాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.17 వద్ద ఉంది. నిఫ్టీలో కోల్ఇండియా, హిందాల్కో, యూపీఎల్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు రాణిస్తే.. బ్రిటానియా, గ్రాసీమ్ ఇండస్ట్రీస్, పవర్‌గ్రిడ్, ఎస్బీఐ లైఫ్, టాటా కంజ్యూమర్ షేర్లు నష్టాలు చవిచూశాయి. ఆటో, బ్యాంకులు, రియాల్టీ, పవర్ షేర్లు ఒక్కొక్కటి ఒక్కో శాతం మేర క్షీణించాయి. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, చమురు, విద్యుత్ రంగాల షేర్లు నష్టాల బాట పట్టడం మార్కెట్‌పై ప్రభావం చూపించింది. మరోవైపు ఫార్మా, స్టీల్ రంగాల షేర్లు కొనుగోలు చేసేందుకు మదుపర్లు ఆసక్తి చూపారు. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతానికి పైగా పెరిగింది.
(చదవండి: ఓలా మరో సంచలనం! 5 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. 160 కి.మీ ప్రయాణం..)
Comments
Please login to add a commentAdd a comment