
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత లాభాల్లో పయనించాయి. రియాల్టీ, ఐటీ, ఫార్మా షేర్లు రాణించడంతో సూచీలు లాభాలలో ముగిశాయి. అలాగే, కనిష్ట ధరల వద్ద షేర్లు అందుబాటులో ఉండటంతో మదుపరులు కొనుగోలుకు మొగ్గుచూపారు. ముగింపులో, సెన్సెక్స్ 581.34 పాయింట్లు(1.10%) పెరిగి 53,424.09 వద్ద ఉంటే, నిఫ్టీ 150.30 పాయింట్లు(0.95%) లాభపడి 16,013.50 వద్ద ఉన్నాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.92 వద్ద ఉంది.
నిఫ్టీలో ఐఓసీ, సన్ ఫార్మా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, సీప్లా, టీసీఎస్ షేర్లు రాణిస్తే.. మరోవైపు హిందాల్కో ఇండస్ట్రీస్, ఓఎన్ జీసీ, టాటా స్టీల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా ఇండస్ట్రీస్ అత్యధికంగా నష్టపోయాయి. లోహపు షేర్లు మినహా మిగిలిన రంగాలన్నీ చివరకు భారీగా లాభాలు నమోదు చేశాయి. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ రంగాలు సూచీలను లాభాల్లోకి మళ్లించాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు ఒక శాతం చొప్పున వృద్ధి సాధించాయి.
(చదవండి: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకూడదంటే.. ఇక అదొక్కటే మార్గం..?)