
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా ఊగిసలాట దొరణి కనబరిచాయి. చివరిలో కొద్ది పుంజుకోవడంతో అతి భారీ నష్టాల నుంచి మార్కెట్ బయటపడింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, చమురు ధరల మంట, నిత్యావసర ధరల పేరుగుతాయని అనే భయాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. మరోవైపు రష్యా తన దాడులను ఉదృతం చేసింది.
ఫలితంగా యుద్ధ పరిణామాలు మరింత సంక్షోభం దిశగా పయణిస్తున్నాయని ప్రపంచ మార్కెట్లలో జోరు తగ్గింది, ఏషియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ముగింపులో, సెన్సెక్స్ 689.78 పాయింట్లు(1.23%) క్షీణించడంతో 55557.50 పాయింట్ల వద్ద స్థిర పడితే, నిఫ్టీ 165.10 పాయింట్లు(0.98%) నష్టపోయి 16628.80 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 75.71 వద్ద ముగిసింది. నిఫ్టీలో టాటాస్టీల్స్, టైటాన్స్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు రాణిస్తే.. మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఆటో, బ్యాంకింగ్ రంగాలలో ఇండెక్స్ ఒక్కొక్కటి 2 శాతం పడిపోయాయి.
(చదవండి: శభాష్ ఎలన్ మస్క్.. బాధితులకు అండగా టెస్లా కంపెనీ..!)
Comments
Please login to add a commentAdd a comment