
అంతర్జాతీయ అంశాలు దేశీయ మార్కెట్లపై అనుకూల ప్రభావాన్ని చూపాయి. దీంతో బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారం దిశగా అడుగులు పడడం, బాండ్లపై రాబడులను పరిమితం చేసేందుకు బ్యాంక్ ఆఫ్ జపాన్ సరళతర ద్రవ్యపాలసీ విధానానికే మొగ్గుచూపడం వంటి అంశాలు మదుపర్లు ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఫలితంగా ఉదయం 9.20గంటల సమయానికి దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.బీఎస్‌ఈ సెన్సెక్స్ 322 పాయింట్లు పెరిగి 58266 వద్ద.. నిఫ్టీ 84 పాయింట్లు బలపడి 17,409 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది.
కాగా, టాటా కాన్స్, హీరో మోటో కార్ప్, టాటా మోటార్స్, కిప్లా, ఎయిర్‌టెల్,హెచ్‌డీఎఫ్‌సీ,బజాజ్ ఫైనాన్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజికీ షేర్లు లాభాల్లో కొనసాగున్నాయి. ఓఎన్‌జీసీ, హిందాల్కో, జేఎస్‌డ్ల్యూ స్టీల్, టాటాస్టీల్, టెక్ మహీంద్రా,ఐటీసీ, కోల్ ఇండియా, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.