
గ్లోబల్ మార్కెట్లలో బలహీనమైన వాతావరణం ఉండడంతో మంగళవారం భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు ఓపెనింగ్‌లోనే భారీ నష్టాలతో మొదలయ్యాయి. యూఎస్ ద్రవ్యోల్బణం డేటా కంటే ట్రెజరీ ఈల్డ్స్ మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఆసియా షేర్లు భారీగా పతనమైనాయి. వివిధ కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను రిలీజ్ చేసే నేపథ్యంలో ఇన్వెస్టర్లు అచితూచి అడుగులు వేస్తున్నారు.
మంగళవారం ఉదయం 9. 40 సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ బిఎస్‌ఇ సెన్సెక్స్ 0.71 శాతం లేదా 429. 53 పాయింట్లు తగ్గి 58,527 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా 145 పాయింట్లు లేదా 0.83 శాతం క్షీణించి 17,528 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ మిడ్‌క్యాప్-100, 0.71 శాతం పతనమయ్యాయి. స్మాల్ క్యాప్ షేర్లు 0.40 శాతం క్షీణించడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు ప్రతికూలంగా కదలాడుతున్నాయి.
అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్‌మిషన్, టోరంట్ పవర్, అదానీ పవర్ లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, విప్రో, ఎల్‌అండ్‌టి, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఎస్‌బిఐ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
చదవండి: దుమ్మురేపిన టీసీఎస్...! తొలిసారి రికార్డు స్థాయిలో..!