
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత అదే తిరుతో చివరి వరకు కొనసాగాయి. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు, ద్రవ్యోల్బణ భయాలు, ముడి చమురు ధరల పెరుగుదల, దేశీయంగా ఇంధన రిటైల్ ధరల పెంపు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. వంటి ప్రతికూల పరిణామాలతో మదుపరులు ఆచీ తూచీ అడుగులు వేశారు. దీంతో, సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి.
ముగింపులో, సెన్సెక్స్ 304.48 పాయింట్లు(0.53 శాతం) క్షీణించి 57,684.82 వద్ద ఉంటే, నిఫ్టీ 69.80 పాయింట్లు(0.40 శాతం) నష్టపోయి 17,245.70 వద్ద ముగిసింది. ఈరోజు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.33 వద్ద ఉంది. నిఫ్టీలో హిందాల్కో ఇండస్ట్రీస్, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, టాటా స్టీల్, యూపీఎల్ షేర్లు రాణిస్తే.. కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్, సిప్లా షేర్లు నష్టాలతో ముగిశాయి. హెల్త్ కేర్, మెటల్, ఆయిల్ & గ్యాస్, పవర్ సూచీలలో ఎక్కువగా కొనుగోళ్లు జరిగితే.. ఆటో, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీలో అమ్మకాలు జరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా రెండవ రోజు ఫ్లాట్'గా ముగిశాయి.
(చదవండి: బాదుడే..బాదుడు! సామాన్యులకు మరో షాక్.. వీటి ధరలు పెరగనున్నాయ్!)
Comments
Please login to add a commentAdd a comment