
ముంబై: అంతర్జాతీయ పరిణామాలతో ఇన్వెస్టర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రిస్క్ తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. దీంతో మంగళవారం మార్కెట్ సూచీలు లాభ నష్టాల మధ్య దోబూచులాడుతున్నాయి.
ఈ రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్ 270 పాయింట్లకు పైగా నష్టంతో 54,309 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత మరింతగా నష్టపోతూ 54,269 పాయింట్లకు చేరుకుంది. ఇక్కడ కొనుగోళ్ల మద్దతు లభించడంతో క్రమంగా పుంజుకోవడం మొదలైంది. ఉదయం 9:50 గంటల సమయంలో 112 పాయింట్ల లాభంతో 54,582 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఆరంభంలో నష్టాలు ఎదురైనా ఆ తర్వాత పుంజుకుంది. 29 పాయింట్ల లాభంతో 16,331 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.
ఇన్ఫోసిస్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టాల్లో ఉండగా ఇండియా వీఐఎక్స్, ఏషియన్ పేయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజూకి ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభాలు పొందాయి.
Comments
Please login to add a commentAdd a comment