
బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్‌లో లాభాలతో ముగిశాయి. గురువారం సైతం సూచీలు అదే జోరును కంటిన్యూ చేస్తాయని భావించిన మదుపర్లకు నిరాశే ఎదురైంది. దేశీయ స్టాక్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.30గంటల సమయంలో సెన్సెక్స్ 278 పాయింట్లు నష్టపోయి 54029 వద్ద, నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 16078 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగుతుంది.
రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్‌యూఎల్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, బ్రిటానియా, ఐటీసీ,మారుతి సుజికీ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. టైటాన్ కంపెనీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ,ఏసియన్ పెయింట్స్, హిందాల్కో,విప్రో, కొటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.