
( ఫైల్ ఫోటో )
ముంబై: హోలి పండగ ముందు స్టాక్ మార్కెట్‌లో జోష్ నెలకొంది. క్రూడ్ ఆయిల్ రేట్లు దిగిరావడం, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపు వాయిదా పడవచ్చనే అంచనాల నడుమ దేశీ సూచీలు లాభాల బాట పట్టాయి. ఏషియా స్టాక్ మార్కెట్లలో కనిపిస్తున్న సానుకూల వాతావరణం దేశీ మార్కెట్లపై కూడా కనిపిస్తోంది ఫలితంగా మార్కెట్ మొదలైన గంటకే భారీ లాభాలు నమోదు అవుతున్నాయి.
విదేశీ ఇన్వెస్టర్లు ఊగిసలాట ధోరణిలో ఉన్న దేశీ ఇన్వెస్టర్లు మార్కెట్‌లో కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉదయం 9:45 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 945 పాయింట్లు లాభపడి 56,721 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 267 పాయింట్లు లాభపడి 16,928 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment