
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకుపోతున్నాయి. ఏషియన్ మార్కెట్లు లాభాల్లో ఉండటం, ద్రవ్యోల్బణం నియంత్రించేందుకు ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ దూకుడుగా చర్యలు తీసుకోవడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. దీంతో మార్కెట్‌లోకి పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా బాండ్ల కొనుగోళ్లు జోరుమీదున్నాయి.
ఈ రోజు ఉదయం 9:50 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 205 పాయింట్లు లాభపడి 58,194 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 17,379 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పేయింట్స్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక లిస్టింగ్ మొదలైంది ఇప్పటి వరకు వరుసగా నష్టాలే తప్ప లాభాలంటూ ఎరుగని పేటీఎం షేరు ధర ఈ రోజు స్వల్పంగా పుంజుకుంది.
Comments
Please login to add a commentAdd a comment