
ముంబై : దేశీ స్టాక్ మార్కెట్‌లో బుల్ జోరు కొనసాగుతోంది. మార్కెట్ ఆరంభం నుంచి చివరి వరకు దేశీ సూచీలు లాభాల్లో కొనసాగాయి. ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యాల మధ్య మరోసారి శాంతి చర్చలు జరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దానికి తగ్గట్టే దేశీ సూచీలు సైతం లాభాల బాట పట్టాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ దాదాపు నెలన్నర రోజుల తర్వాత మరోసారి 58 వేల మార్క్‌ని క్రాస్ చేసింది. చివరిసారి ఫిబ్రవరి 10న సెన్సెక్స్ 58 వేలు పాయింట్లు క్రాస్ చేసింది. ఆ తర్వాత వరుస నష్టాలతో ఒక దశలో 52 వేలకు పడిపోయింది. కాగా బుధవారం దేశీ సూచీలు జోరు చూపించడంతో 58 వేలు దాటింది.
ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ 58,362 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మార్కెట్ ముగిసే సమయానికి 740 పాయింట్లు లాభపడి 58,683 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 172 పాయింట్లు లాభపడి 17,498 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. బజాజ్ ఫిన్ సర్వీస్, మహీంద్రా అండ్ మమీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాలు పొందగా ఐటీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment