
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మార్కెట్ ముగిసే వరకు అంతకంతకూ పెరుగుతూ లాభాల్లో దూసుకెళ్లాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఐటీ, ఆటో, బ్యాంకింగ్ షేర్ల అండతో సూచీలు లాభాల్లో ముగిశాయి. ముగింపులో, సెన్సెక్స్ 935.72 పాయింట్లు (1.68%) పెరిగి 56,486.02 వద్ద ఉంటే, నిఫ్టీ 240.80 పాయింట్లు (1.45%) పెరిగి 16,871.30 వద్ద ఉంది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.50 వద్ద ఉంది.
నిఫ్టీలో ఇన్ఫోసీస్, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్ షేర్లు రాణిస్తే.. ఐఓసీ, ఓఎన్‌జీసీ, హెచ్‌యుఎల్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నష్టపోయాయి. ఐటీ, బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం పెరిగితే, రియాల్టీ ఇండెక్స్ దాదాపు 2 శాతం తగ్గింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిస్తే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం లాభపడింది.
(చదవండి: ప్రపంచ దేశాల్లో కరోనా కలవరం, చైనాకు యాపిల్ భారీ షాక్!)