
ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఊపుతో లాభాల బాట పట్టిన మార్కెట్.. ఈ రోజు ఉదయం అంతర్జాతీయ మార్కెట్ సూచీల ఫలితాలతో చిన్న కుదుపులకు లోనైంది. యూఎస్, ఇంగ్లండ్, ఏషియన్ మార్కెట్లు శుక్రవారం ప్రతికూలంగా మొదలవడంతో దేశీ సూచీలు సైతం ఆరంభంలో నష్టాలు చవి చూశాయి. అయితే అరగంట తర్వాత క్రమంగా మార్కెట్ పుంజుకోవడం మొదలు పెట్టింది.
ఈ రోజు ఉదయం బీఎస్‌సీ సెన్సెక్స్ 55,218 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. క్రితం రోజు 55,464 పాయింట్ల దగ్గర ముగిసింది. దీంతో ఆరంభంలో సుమారు రెండు వందల పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్. కానీ ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో క్రమంగా పుంజుకుంటూ ఉదయం 9:45 గంటల సమయానికి 113 పాయింట్ల లాభంతో 55,577 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.
ముందు నుంచి మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నట్టే 16,500 పాయింట్ల దగ్గర నిఫ్టీకి తీవ్ర రెసిస్టెన్స్ ఎదురైంది. మార్కెట్ ప్రారంభం అయిన కాసేపటికే 70 పాయింట్ల వరకు నష్టపోయినా తర్వాత పుంజుకుంది. ఉదయం 9:45 గంటల సమయానికి 54 పాయింట్లు లాభపడి 16,649 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment