దేశీయ సూచీలు సోమవారం (ఏప్రిల్ 4) భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్‌లలో బలమైన కొనుగోళ్ల ఆసక్తి ఇన్వెస్టర్లలో ఉండడంతో భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు భారీ లాభాలను గడించాయి. ఇక ప్రైవేట్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో విలీన ప్రణాళికను ప్రకటించిన తర్వాత దేశీయ సూచీలు రెండున్నర నెలల కంటే ఎక్కువ గరిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ విలీన వార్తలు రావడంతో మార్కెట్ ప్రారంభంలో ఒక గంటలోనే ఇన్వెస్టర్లు 3 లక్షల కోట్ల లాభాలను వెనకేశారు.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,335 పాయింట్లు లేదా 2.25 శాతం లాభపడి 60,611.74 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 382.9 పాయింట్లు లేదా 2.17 శాతం పెరిగి 18,053 వద్ద ముగిసింది. నీఫ్టీలో 15 సెక్టార్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
ట్రేడింగ్ ప్రారంభానికి ముందు హెచ్‌డీఎప్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల విలీన ప్రకటనతో కంపెనీల షేర్లు రాకెట్‌లా దూసుకుపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. అదానీ పోర్ట్స్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎల్ అండ్ టి, సన్ ఫార్మా టాప్ కూడా భారీ లాభాలను పొందాయి. ఇక టైటాన్,ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
చదవండి: డబ్బులే డబ్బులు...గంటలోనే రూ. 3 లక్షల కోట్లను వెనకేశారు..!
Comments
Please login to add a commentAdd a comment