
ముంబై: దేశీయ మార్కెట్లు మూడోరోజు కూడా లాభాలను గడించాయి. గురువారం రోజున మార్కెట్లు ప్రారంభంలో కాస్త ఒడిదుడుకలను ఎదుర్కొన్న లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ సూచీ 0.23 శాతం పెరిగి 123.07 పాయింట్ల లాభంతో 54, 492.84 వద్ద ముగిశాయి. నిఫ్టీ 0.22 శాతం పెరిగి 35.80 పాయింట్ల లాభంతో 16,294.60 వద్ద నిలిచింది.
పీఎస్‌యూ బ్యాంకు షేర్లు నష్టాలను చవిచూశాయి. మెటల్ కంపెనీ షేర్లు 1 శాతం పెరిగాయి. ఐటీ షేర్లు కూడా 0.7 శాతం వరకు పెరిగాయి. భారతీ ఎయిర్‌టెల్, ఐచర్ మోటార్స్, ఐటీసీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ కంపెనీలు షేర్లు లాభాలను గడించాయి. ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 74.17గా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment