దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ 114 పాయింట్లు తగ్గి 24,635కు చేరింది. సెన్సెక్స్ 427 పాయింట్లు నష్టపోయి 80,573 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 103.5 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 74.7 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.09 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.02 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.04 శాతం లాభపడింది.
ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల కారణంగా ఇటీవల భారీగా పడిన మార్కెట్లు క్రమంగా పుంజుకున్నాయి. గడిచిన రెండు రోజుల నుంచి తిరిగి మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. ఇరాన్ ఆయిల్ రిఫైనరీలపై దాడి చేయబోమని ఇజ్రాయెల్ ప్రకటించడంతో క్రూడాయిల్ ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. ఇది ఒకింత సానుకూలాంశమే. కానీ అక్టోబర్ నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎఫ్‌ఐఐలు భారీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ నుంచి షేర్లు అమ్ముతున్నారు. దాంతో మార్కెట్లు పతనమవుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment