సాక్షి మనీ మంత్ర: 2023లో చివరి రోజు.. నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు | Stock Market Rally On Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: 2023లో చివరి రోజు.. నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Dec 29 2023 4:21 PM | Updated on Dec 29 2023 5:56 PM

Stock Market Rally On Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌లు ఈ ఏడాది చివరిరోజు ట్రేడింగ్‌ను నష్టాలతో ముగించాయి. నిఫ్టీ 47 పాయింట్లు నష్టపోయి 21,731 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 170 పాయింట్లు దిగజారి 72,240 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ 30 సూచీలో టాటా మోటార్స్, నెస్లే ఇండియా, హిందుస్థాన్ యూనిలివర్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్అండ్‌టీ లాభాల్లో ముగిశాయి.

ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్, ఎంఅండ్ఎం, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, నష్టాల్లో ముగిశాయి. భారీ బ్లాక్ డీల్ తర్వాత ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్లు 3 శాతం పెరిగాయి. సింగిల్ బ్లాక్ డీల్‌లో దాదాపు 1.65 మిలియన్ షేర్లు చేతులు మారాయని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అయితే కొనుగోలుదారులు, విక్రయదారుల వివరాలు తెలియరాలేదు.

2030 నాటికి 8,00,000 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులతో భర్తీ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఇటీవల ప్రభుత్వ అధికారులు తెలిపినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి. దాంతో ఎలక్ట్రిక్ బస్సు తయారీదారుల్లో ముందు వరుసలో ఉన్న టాటా మోటార్స్ స్టాక్ శుక్రవారం 6.5% పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ (11%), జేబీఎం ఆటో (5.1%), అశోక్ లేలాండ్ (4.4%), సంవర్ధన మదర్సన్ (5.4%), ఎక్సైడ్ ఇండస్ట్రీస్ (5.4%) పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement