దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీగా పుంజుకున్నాయి. మంగళవారం అమ్మకాలకు ఆసక్తి చూపిన మదుపర్లు బుధవారం కొనుగోలు వైపు మళ్లారు. నిఫ్టీ 227 పాయింట్లు లాభపడి 21,465కు చేరింది. సెన్సెక్స్ 689 పాయింట్లు ఎగబాకి 71,060 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిండ్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌టీపీసీ షేర్లు భారీ లాభాల్లోకి చేరుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర గత 24 గంటల్లో స్వల్పంగా పెరిగి 79.59 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపరులు (FIIs)’ మంగళవారం రూ.3,115.39 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపరులు (DIIs)’ రూ.214.40 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment